Kaneria VS Afridi: దానిష్ కనేరియా వ్యాఖ్యలపై కొద్దిరోజులుగా సైలెంట్ గా ఉన్న ఆఫ్రిది తన మౌనాన్ని వీడారు. పాకిస్తాన్ కు చెందిన ఇంటర్నేషనల్ ది న్యూస్ పత్రికకు ఆఫ్రిది ఇంటర్వ్యూ ఇచ్చాడు. కనేరియాను ఇస్లాం మతంలోకి మారాలన్నట్టుగా తనపై వస్తున్న ఆరోపణలను ఆఫ్రిది ఖండించారు. కనేరియా తనకు తమ్ముడులాంటివాడన్నాడు. అతనితో కలిసి కొన్నేళ్లు పాకిస్తాన్ జట్టుకు ఆడినట్టు ఆఫ్రిది చెప్పుకొచ్చాడు. 15-20 ఏళ్లుగా చెప్పని విషయాలను ఇప్పుడెందుకు తెరపైకి తెచ్చాడో అర్థం కావడం లేదన్నాడు ఆఫ్రిది. తన ప్రవర్తన బాగాలేకపోతే.. అప్పుడే పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించాడు.
ఇరుదేశాల మధ్య చిచ్చు పెట్టేలా కనేరియా భారత మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడని ఆఫ్రిది ఫైర్ అయ్యారు. ఆఫ్రిది వ్యాఖ్యలకు కనేరియా సైతం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. ఇండియా అనేది మన శత్రుదేశం కాదు అన్నాడు. మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడే వ్యక్తులే మన శత్రువులన్నాడు. ఒకవేళ భారత్ ను శత్రుదేశంగా భావించేవాళ్లు.. మరి ఆ దేశంలోని ఛానళ్లకు ఎందుకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారని ఆఫ్రిదిని ప్రశ్నించాడు. మతం మార్పిడిపై చెప్పినట్టు చేయకపోతే.. తన కేరీర్ ను నాశనం చేస్తానని ఆఫ్రిది హెచ్చరించాడని కనేరియా ట్విట్టర్ లో పోస్టు చేశాడు.
India is not our enemy. Our enemies are those who instigate people in the name of religion.
If you consider India as your enemy, then don't ever go to any Indian media channel. @SAfridiOfficial https://t.co/2gssD7RAHe
— Danish Kaneria (@DanishKaneria61) May 9, 2022
2009లో కనేరియాపై స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు వాస్తవమేనని తేలడంతో 2012లో వేల్స్ క్రికెట్ బోర్డు అతడిపై జీవితకాల నిషేధం కూడా విధించింది. ఈ నిర్ణయాన్ని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా సమర్థించింది. దానిష్ కనేరియా 2000 సంవత్సరం నవంబర్‌లో ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. పాకిస్తాన్ జట్టు తరఫున 61 టెస్టుల్లో 261 వికెట్లు, 18 వన్డేల్లో 15 వికెట్లు పడగొట్టాడు దానేష్ కనేరియా.
అంతకుముందు భారత మీడియాకు ఇంటర్వూ ఇచ్చిన కనేరియా ఆఫ్రిదిపై సంచనల కామెంట్స్ చేశాడు. హిందూ అవ్వడం వల్లే తనను జట్టులో ఇబ్బందులకు గురిచేసేవాడని వెల్లడించాడు. ఆఫ్రిది కెప్టెన్ గా ఉన్న సమయంలో తనను ఎక్కువగా బెంచ్ కే పరిమితం చేసేవాడని కనేరియా వాపోయాడు. జట్టులో కనీసం చోటు దక్కకుండా అనేక కుయుక్తులు పన్నాడని అనడంతో అసలీ వివాదం తెరపైకి వచ్చింది.
Also Read:Cyclone Asani Live Updates: తీవ్ర తుపాను మారిన 'అసని'... ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ..
Also Read:Namitha Pregnant: 41 ఏళ్ల వయసులో తల్లి కాబోతున్న హీరోయిన్.. వైరల్‌గా మారిన బేబీ బంప్ ఫోటోస్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook