Suresh Raina Arrested: ముంబైలో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్, స్టార్ హీరో మాజీ భార్య సైతం!

Suresh Raina Arrested  in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు.

Last Updated : Dec 22, 2020, 03:52 PM IST
  • ముంబై ఎయిర్‌పోర్ట్ సమీపంలోని క్లబ్‌లో పోలీసుల తనిఖీలు
  • క్రికెటర్ సురేష్ రైనా, ఓ హీరో మాజీ భార్య సుసానే ఖాన్ అరెస్ట్
  • మొత్తం 34 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Suresh Raina Arrested: ముంబైలో క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్, స్టార్ హీరో మాజీ భార్య సైతం!

Suresh Raina Arrested in Polce Raid: అసలే చలికాలం.. కానీ చలికాలంలోనే కాస్త ఎంజాయ్ ఎక్కువగా చేద్దామని సెలబ్రిటీలు భావిస్తుంటారు. సెలబ్రిటీలతో పాటు ఈ మధ్య నార్మల్ లైఫ్ జీవించేవారు సైతం మోడ్రన్ లైఫ్‌స్టైల్‌ను ఇష్టపడుతున్నారు. ఈ క్రమంలో ముంబై పోలీసుల తనిఖీలలో భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా అరెస్ట్ అయ్యాడు. స్టార్ క్రికెటర్ రైనా అరెస్ట్ వార్తపై అభిమానులు టెన్షన్‌కు గురవుతున్నారు. అసలేం జరిగిందో ఆ వివరాలు మీకోసం..

ముంబై ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న క్లబ్‌పై పోలీసులు అకస్మిక తనిఖీలు చేపట్టారు. కోవిడ్19 నిబంధనలు ఉల్లంఘించినందుకుగానూ క్లబ్‌లో ఉన్న స్టార్ క్రికెటర్ సురేష్ రైనా (Suresh Raina)ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు సింగర్ గురు రంధవ, బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ మాజీ భార్య సుసానే ఖాన్ సహా మొత్తం 34 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీస్ స్టేషన్‌కు తరలించిన అనంతరం బెయిల్ మీద కొందరిని విడుదల చేసినట్లు సమాచారం. 

Also Read: Funny Memes On Prithvi Shaw: జూనియర్ సచిన్ పృథ్వీ షాపై పేలుతున్న జోక్స్

 

బ్రిటన్‌లో తాజాగా పుట్టుకొచ్చిన కొత్త కరోనా వైరస్ (CoronaVirus) కారణంగా కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ముంబైలోని డ్రాగన్‌ప్లై క్లబ్‌పై పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. రైనా, గురు రంధవ, సుసానే ఖాన్ సహా 34 మందిపై ఐపీసీ సెక్షన్ 188, 269, 34 కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.

Also Read: Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు 

కాగా, కోవిడ్19 నిబంధనలు, ప్రొటోకాల్‌కు విరుద్ధంగా మందు పార్టీలో అధిక సమయం గడిపినందుకు పోలీసులు కేసు నమోదుచేశారు. క్లబ్ సిబ్బంది ఏడుగురిని సైతం ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News