Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత్‌కు నాలుగో పతకం.. వెయిట్‌ లిఫ్టర్ బింద్యారాణికి రజతం

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు.  55 కిలోల విభాగంలో బింద్యారాణి అద్బుత ప్రతిబ కనబరిచి సిల్వర్ మెడల్ గెలిచింది. 23 ఏళ్ల బింద్యారాణి  స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసింది.

Written by - Srisailam | Last Updated : Jul 31, 2022, 09:44 AM IST
  • కామన్వెల్త్ గేమ్స్‌ లో వెయిట్‌ లిఫ్టర్ల జోరు
  • 55 కిలోల విభాగంలో బింద్యారాణికి రజతం
  • నాలుగు పతకాలతో టాప్ టెన్ లో భారత్
Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత్‌కు నాలుగో పతకం.. వెయిట్‌ లిఫ్టర్ బింద్యారాణికి రజతం

Commonwealth Games 2022: కామన్వెల్త్ గేమ్స్‌ లో భారత పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్‌లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో పతకాల పండ పండిస్తున్నారు.  55 కిలోల విభాగంలో బింద్యారాణి అద్బుత ప్రతిబ కనబరిచి సిల్వర్ మెడల్ గెలిచింది. 23 ఏళ్ల బింద్యారాణి స్నాచ్‌లో 86, క్లీన్ అండ్ జెర్క్‌లో 116.. మొత్తం 202 కేజీల స్కోర్ చేసింది. బింద్యారాణి మెడల్ భారత్ కు నాలుగో పతకం. తాజ మెడల్ లో పతకాల పట్టికలో భారత్ టాప్ టెన్ లో నిలిచింది. ఇప్పటికే కామన్వెల్త్ గేమ్స్‌ వుమెన్ మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సొంతం చేసుకుంది. పురుషుల 55 కేజీల్లో సంకేత్‌ కు సిల్వర్ మెడల్ రాగా..  61 కేజీల విభాగంలో గురురాజ పూజారి కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. 

వెయిట్‌లిఫ్టర్ల  అద్భుత ప్రదర్శనతో శనివారం ఒక్కరోజే భారత్ కు మూడు పతకాలు వచ్చాయి. మహిళల 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను పసిడి పతకం సాధించింది. ఈ విభాగంలో ఫెవరెట్‌గా బరిలో దిగిన మీరాబాయి 201 కేజీల విభాగంలో గత కామన్వెల్త్‌ క్రీడల రికార్డ్ బద్దలు కొట్టింది. చానుకు పోటీ కూడా ఎదురుకాలేదు.రెండో స్థానంలో నిలిచిన లిఫ్టర్‌కు చానుకు మధ్య 29 కేజీల గ్యాప్ ఉంది. చాను కంటే ముందే మహారాష్ట్ర సంచలనం సంకేత్‌ సిల్వర్  సాధించి భారత్ కు పతకం అందించాడు. కేవలం ఒక్క కిలో తేడాతో  గోల్డ్ మెడల్ సాధించలేకపోయాడు సంకేత్.  పురుషుల 61 కేజీల విభాగంలో గురురాజ కాంస్య పతకం సాధించాడు. 

Read also: Komatireddy:మునుగోడులో కోమటిరెడ్డి ఒంటరయ్యారా? అందుకే రాజీనామాకు భయపడుతున్నారా? 

Read also: HYD MMTS: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో ఇవాళ 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు... రద్దయిన రైళ్ల వివరాలివే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News