Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!

చైనీస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి యూటర్న్‌ తీసుకున్నారు. చైనాకు చెందిన ఓ ప్ర‌ముఖ నేత త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు ఆమె గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌లను ఖండించారు. త‌న‌పై లైంగిక దాడి జ‌ర‌గలేద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 20, 2021, 12:58 PM IST
  • నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు
  • యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్
  • లైంగికఆరోపణలు నిజం కాదు
 Peng Shuai: నాపై లైంగిక దాడి జ‌ర‌గలేదు.. యూటర్న్‌ తీసుకున్న టెన్నిస్ స్టార్!!

Chinese Tennis Star Peng Shuai takes U-Turn Over Zhang Gaoli's Sex Assault: చైనీస్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి (Peng Shuai) యూటర్న్‌ తీసుకున్నారు. చైనా (China)కు చెందిన ఓ ప్ర‌ముఖ నేత త‌న‌ను లైంగికంగా వేధించిన‌ట్లు (Sex Assault) ఆమె గ‌తంలో చేసిన ఆరోప‌ణ‌లను ఖండించారు. త‌న‌పై లైంగిక దాడి జ‌ర‌గలేద‌ని తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో చెప్పారు. అంతేకాదు తాను క్షేమంగానే ఉన్నట్లు పేర్కొన్నారు. మాజీ వింబుల్డన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ డబుల్స్ ఛాంపియన్‌ అయిన పెంగ్‌ షువాయి (Peng Shuai U-Turn) మాట మార్చడంతో అభిమానులు ఆమెపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిజం ఏంటో నిర్భయంగా చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిదంటే?... 

చైనా కమ్యూనిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన జాంగ్ గ‌వోలీ (Zhang Gaoli) తనపై లైంగిక దాడికి పాల్పడ్డారంటూ నవంబర్ 2న టెన్నిస్‌ క్రీడాకారిణి పెంగ్‌ షువాయి సోషల్ మీడియాలో ఆరోపణలు చేశారు. జాంగ్ గ‌వోలీ తనతో శృంగారం చేయాలని (Sex Assault) బలవంతం చేశాడని, 7 ఏళ్ల క్రితం తనతో  ఓసారి శృంగారంలో పాల్గొన్నాని చెప్పారు. అయితే పెంగ్‌ షువాయి ఆ పోస్టులు తొలగించడం గమనార్హం. తర్వాత ఆమె అదృశ్యం కావడంతో పెద్ద ఎత్తున ఉద్యమం చెలరేగింది. ఈ విషయంలో అంతర్జాతీయ టెన్నిస్‌ స్టార్లు నోవాక్ జకోవిచ్, సెరీనా విలియమ్స్, నవోమి ఒసాకా సైతం ఆందోళన వ్యక్తం చేశారు. పెంగ్‌ ఎక్కడున్నారు, విచారణ జరపాలని మండిపడ్డారు. 

Also Read: Aishwarya Rai: పనామా పేపర్స్ కేసులో ఐశ్వర్య రాయ్‌కి ఈడీ సమన్లు...

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ వీడియోలో మాట్లాడిన పెంగ్‌ షువాయి.. తాను అసలు ఎవరిపై ఆరోపణలు చేయలేదని చెప్పారు. అందుకు సంబంధించిన వార్తను సింగపూర్‌కు చెందిన ఓ ప్రముఖ చైనా దినపత్రిక ప్రచురించింది. 'నేను ఒక ముఖ్యమైన విషయం అందరికి చెప్పాలనుకుంటున్నా. నేనెప్పుడూ ఎవరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు, ఫిర్యాదులు చేయలేదు. ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేయాలనుకుంటున్నా' అని పెంగ్‌ పేర్కొన్నారు. అయితే చైనా మాజీ వైస్‌ ప్రీమియర్‌ జాంగ్‌ గవోలీ (Zhang Gaoli)పై చేసిన వ్యాఖ్యలపై ప్రశ్నించగా.. అది తన వ్యక్తిగత విషయమని, దాన్ని ప్రజలంతా తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. 

Also Read: Rashmika Mandanna: రాహుల్‌ రవీంద్రన్‌కు ఓకే చెప్పిన రష్మిక.. కొత్త ప్రయోగం ఫలించేనా?

పెంగ్‌ షువాయి (Peng Shuai) బాహ్య ప్రపంచానికి కనపడకుండా పోయేసరికి చైనాకు చెందిన ఓ అధికారిక పత్రిక ఆమె క్షేమంగానే ఉన్నట్లు డబ్ల్యూటీఏ చీఫ్‌ స్టీవ్‌ సైమన్‌కు ఈమెయిల్‌ చేసింది. దీనిపై అప్పుడు స్టీవ్‌ అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ఈమెయిల్‌ స్క్రీన్‌షాట్లను వీడియోలో చూపించగా.. అది తాను స్వయంగా రాసిందేనని తాజాగా పెంగ్‌ స్పష్టం చేశారు. ఆ సమయంలో పెంగ్‌ కనపడకపోవడంపై ఏమైనా కారణం ఉందా? అని వీడియోలో ఒక వ్యక్తి ప్రశ్నించగా.. అలాంటిదేమీ లేదని, తాను ఎప్పుడూ స్వేచ్ఛగానే ఉన్నట్లు చెప్పుకొచ్చారు. మొత్తానికి పెంగ్‌ యూటర్న్‌ తీసుకోవడంతో.. అసలు ఏం జరిగిందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News