Brett Lee says Iam surprised at Umran Malik not playing in T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ 2022కు సమయం ఆసన్నమవుతోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి మెగా టోర్నీకి తెరలేవనుంది. టీ20 ప్రపంచకప్ కోసం ఇప్పటికే అన్ని జట్లు తన టీమ్స్ ప్రకటించాయి. పొట్టి టోర్నీలో పాల్గొనేందుకు భారత క్రికెట్ జట్టు నేడు (అక్టోబర్ 6) ఆస్ట్రేలియా బయలుదేరింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయం కారణంగా జట్టుకు దూరమవడంతో టీమ్ మేనేజ్మెంట్ ఆందోళన చెందుతోంది. మరోవైపు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ద్వైపాక్షిక మ్యాచ్‌లలో భారత పేసర్ల ప్రదర్శనలు కూడా ఏమంత ఆశాజనకంగా లేవు. ఈ నేపథ్యంలో భారత బౌలింగ్ దాడిపై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ స్పందించాడు.
రోడ్‌సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2022లో భాగంగా ఆస్ట్రేలియా లెజెండ్స్ తరఫున బ్రెట్ లీ ఆడిన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియా టుడేతో మాట్లాడుతూ భారత ప్రపంచకప్ జట్టులో ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ లేకపోవడం తనను షాక్‌కు గురిచేసిందన్నాడు. 'ఆస్ట్రేలియాలో ఉమ్రాన్ మాలిక్ ఆడితే బాగుండేది. కానీ అతడు భారత జట్టులో లేకపోవడం నన్ను షాక్‌కు గురిచేసింది. అతని స్పీడ్ పరిగణలోకి తీసుకుని అయినా జట్టులోకి తీసుకోవాల్సింది. ఆస్ట్రేలియా లాంటి పేస్ పిచ్‌లపై ఉమ్రాన్ ఉంటే.. ప్రత్యర్థి బ్యాటర్లకు చాలా ఇబ్బందిగా ఉండేది' అని లీ అన్నాడు.
ఆస్ట్రేలియాలో బౌలింగ్ పరిస్థితులను మరియు టీ20 ప్రపంచకప్ 2022లో పేస్ మరియు బౌన్స్ ఎంత పాత్ర పోషిస్తాయో కూడా బ్రెట్ లీ వివరించాడు. 'ఆస్ట్రేలియాలో ఎప్పుడైనా పేస్ మరియు బౌన్స్ చాలా కీలకం. మీరు డెత్‌లో పేస్ బౌలింగ్ చేస్తూ.. లైన్ అండ్ లెంగ్త్ బౌలింగ్ చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తారు. మీరు మీ ప్లాన్‌లను ఎంత బాగా అమలు చేస్తారనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. ఇక బ్యాటర్ అదనపు బౌన్స్ ఆడడంపై ఫోకస్ పెట్టాలి. ఎందుకంటే.. ఉపఖండంలోని బ్యాటర్లు పేస్, బౌన్స్‌కు పెద్దగా అలవాటు పడి ఉండరు' అని లీ చెప్పాడు.
Also Read: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్.. గైక్వాడ్ అరంగేట్రం! 40 ఓవర్ల మ్యాచ్
Also Read: వెస్టిండీస్ బాహుబలి విధ్వంసం.. టీ20ల్లో డబుల్ సెంచరీ! 77 బంతుల్లో 205 రన్స్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook