Sachin Tendulkar తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ, IPL 2021 వేలం ముందే షాక్

Sachin Tendulkars Son Arjun Tendulkar: ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో రాణించి భారత జట్టులోకి రావాలని కలలు కంటున్నాడు అర్జున్ టెండూల్కర్. కానీ ఐపీఎల్ వేలానికి ముందే సచిన్ తనయుడు అర్జున్‌కు ఎదురుదెబ్బ తగిలింది.

Written by - Shankar Dukanam | Last Updated : Feb 11, 2021, 01:27 PM IST
  • సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే
  • IPL 2021 వేలంలో పాల్గొనడానికి ముందే యువ క్రికెటర్ అర్జున్‌కు ఎదురుదెబ్బ
  • ఈ ఫిబ్రవరి 20వ తేదీన విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది
Sachin Tendulkar తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ, IPL 2021 వేలం ముందే షాక్

Sachin Tendulkars Son Arjun Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్‌కు నిరాశే ఎదురైంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2021) వేలంలో పాల్గొనడానికి ముందే యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్‌కు ఎదురుదెబ్బ తగిలింది. విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనాల్సిన ముంబై సీనియర్ జట్టులో అతడ్ని ఎంపిక చేయలేదు

ఫిబ్రవరి 20న విజయ్ హజారే ట్రోఫీ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ముంబై సీనియర్ జట్టు ప్రాబబుల్స్ ఎంపిక చేశారు. కానీ ఇందులో సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar) తనయుడు అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) చోటు దక్కించుకోలేకపోయాడు. దీంతో ఈ నెల 18న జరగనున్న ఐపీఎల్ 2021 వేలం(IPL 2021 Auction)లో ఇది అర్జున్‌పై ప్రభావం చూపనుందని తెలుస్తోంది.

Also Read: IPL 2021: సంపాదనలో MS Dhoni అరుదైన ఘనత, ఐపీఎల్‌లో ఏకైక క్రికెటర్‌గా CSK Captain

కాగా, ఇటీవల జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో రాణించి ఐపీఎల్‌ వేలంలో పాల్గొనాలని అర్జున్ టెండూల్కర్(Arjun Tendulkar) భావించాడు. తద్వారా టీమిండియా తలుపు తట్టాలని కలలు కన్నాడు. కానీ టీ20 టోర్నీలో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఓ మ్యాచ్‌లో కేవలం 2 ఓవర్లలోనే 21 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఫామ్ లేని కారణంగా ఎక్కువ అవకాశాలు సైతం దక్కించుకోలేకపోయాడు అర్జున్ టెండూల్కర్.

Also Read: Virat Kohli: కూతురి ఫొటో షేర్ చేసిన Anushka Sharma, పాప పేరేంటో తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News