ఖేల్‌రత్నకు రో'Hitman'ను ఎంపిక చేసిన BCCI...

ప్రతి ఏటా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న అవార్డుకు టీమ్‌ఇండియా (Ro'hit'man)‌ రోహిత్‌ శర్మ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(బీసీసీఐ) నామినేట్‌ చేసింది. 

Last Updated : May 31, 2020, 12:47 AM IST
ఖేల్‌రత్నకు రో'Hitman'ను ఎంపిక చేసిన BCCI...

హైదరాబాద్: ప్రతి ఏటా కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖ ప్రకటించే ప్రతిష్టాత్మక ఖేల్‌రత్న(khel ratna award) అవార్డుకు టీమ్‌ఇండియా (Ro'hit'man)‌ రోహిత్‌ శర్మ పేరును భారత క్రికెట్‌ నియంత్రణ మండలి(BCCI) నామినేట్‌ చేసింది. (Arjuna Award) అర్జున అవార్డుకు మరో ఓపెనర్‌ (Shikhar Dhawan) శిఖర్‌ ధావన్‌, పేసర్‌ (Ishanth Sharma) ఇషాంత్‌ శర్మ పేర్లను కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు (Ministry of Youth Affairs and Sports) నామినేట్‌ చేసింది. మహిళల విభాగంలో అర్జున అవార్డు కోసం భారత మహిళల జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్ (Deepti Sharma)‌ దీప్తిశర్మ పేరును నామినేట్ చేసింది. గతేడాది ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన వన్డే (ICC) ప్రపంచకప్‌ టోర్నీలో ఐదు శతకాలతో భారత ఓపెనర్‌ రోహిత్‌ శర్మ పరుగుల మోత మోగించాడు. ఆ తర్వాత టెస్టుల్లోనూ ఓపెనర్‌గా రాణించి మరిన్ని రికార్డులు సొంతం చేసుకున్నాడు. అలాగే వన్డేల్లో మూడు డబుల్ సెంచరీలు చేసిన ఏకైక క్రికెటర్‌గానూ రికార్డు హిట్‌మ్యాన్‌కే (Hitman) సొంతం. 

Also Read: Lockdown 5.0: రాష్ట్రాలు ఖచ్చితంగా పాటించాల్సిందే... అమలు చేయాల్సిందే...

మరోవైపు శిఖర్‌ ధవన్ (Shikhar Dhawan)‌ సైతం కొన్ని సంత్సరాలుగా నిలకడగా రాణిస్తున్నాడు. టెస్టుల్లో పేసర్‌ ఇషాంత్‌ శర్మ విజృంభిస్తూ ఎంతో కాలంగా జట్టుకు సేవలందిస్తున్నాడు. మరోవైపు భారత మహిళల జట్టు ఆల్‌రౌండర్‌ దీప్తి శర్మ మూడేళ్ళుగా బ్యాట్‌తో, బంతితో అల్ రౌండర్ గా రాణిస్తూ విజయాల్లో కీలకపాత్ర పోషిస్తోంది. 

 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News