Maxwell Engagement: శభాష్.. భారత సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

గత నెలలో తన ప్రేయసి వినీ రామన్‌తో ఆసీస్ క్రికెటర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ నిశ్చితార్థం జరిగింది. అయితే భారతీయ సంప్రదాయంలో మరోసారి ఎంగేజ్ మెంట్ వేడుక నిర్వహించడం విశేషం.

Last Updated : Mar 16, 2020, 10:03 AM IST
Maxwell Engagement: శభాష్.. భారత సంప్రదాయంలో మ్యాక్స్‌వెల్ నిశ్చితార్థం

మెల్ బోర్న్: ఆస్ట్రేలియా విధ్వంసక క్రికెటర్ మాక్స్‌వెల్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్న విషయం తెలిసిందే. భారత సంతతి (సౌత్ ఇండియా)కి చెందిన వినీ రామన్‌తో గాఢమైన ప్రేమలో మునిగి తేలుతున్న మాక్స్‌వెల్ భారత సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం చేసుకున్నారు. రెండేళ్ల ప్రేమాయణం అనంతరం పెద్దలకు చెప్పి తమ ప్రేమను గెలిపించుకున్నారు.

See Pics: మ్యాక్స్‌వెల్ ఎంగేజ్ మెంట్ ఫొటోలు వైరల్

ఇటీవల ఆస్ట్రేలియాలో అక్కడి సంప్రదాయం ప్రకారం మ్యాక్స్‌వెల్, వినీ రామన్‌ల నిశ్చితార్థ వేడుక ఘనంగా నిర్వహించారు. తాజాగా భారత సంప్రదాయంలో నిశ్చితార్థం చేసుకున్నట్లు వినీ రామన్ సోషల్ మీడియా వేదిక ఇన్ స్టాగ్రామ్ ద్వారా తెలిపారు. నిశ్చితార్థం సందర్భంగా కాబోయే భర్త మ్యాక్స్‌వెల్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు.

Also Read: భారత సంతతి యువతితో మ్యాక్స్‌వెల్ ఎంగేజ్ మెంట్

భారత సంతతికి చెందిన వినీ రామన్ ఫ్యామిలీ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్థిరపడింది. వినీ రామన్ మెల్‌బోర్న్‌లో ఫార్మసిస్ట్‌గా సేవలందిస్తున్నారు. ఫిబ్రవరి 26న మ్యాక్సీ, వినీ రామన్‌ల ఎంగేజ్ మెంట్ జరిగింది. క్రికెటర్లు, ఇతర రంగాల సెలబ్రిటీలు ఈ జంటకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. అయితే భారతీయ పద్ధతి, సంప్రదాయాన్ని గౌరవించి మరోసారి మన పద్ధతిలో నిశ్చితార్థం చేసుకున్న మ్యాక్స్‌వెల్‌ను భారత నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. వెల్ డన్ మ్యాక్సీ అని, అంతా శుభం జరగాలని ఆకాంక్షిస్తూ కామెంట్ చేస్తున్నారు. 

See photos: భీష్మ సక్సెస్ మీట్‌లో రష్మిక మెరుపులు

See Photos: బుల్లితెర భామ.. మాల్దీవుల్లో హంగామా  

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News