ICC Test Rankings: టెస్టుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా... మూడో స్థానానికి పడిపోయిన భారత్..

ICC Test Rankings: ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా నెం. 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. టీమిండియా మూడోస్థానానికి దిగజారింది.  

Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2022, 01:27 PM IST
  • ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌ విడుదల
  • టెస్టుల్లో నెం.1గా ఆస్ట్రేలియా
  • మూడో స్థానానికి పడిపోయిన భారత్
ICC Test Rankings: టెస్టుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఆస్ట్రేలియా... మూడో స్థానానికి పడిపోయిన భారత్..

ICC Test Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో (ICC Test Rankings) భారత్​ మూడో స్థానానికి పడిపోయింది. ఇటీవల దక్షిణాఫ్రికాతో 1-2తో సిరీస్ కోల్పోవడంతో...దాని ప్రభావం ర్యాంకింగ్స్ పై పడింది. ఇంగ్లాండ్​పై యాషెస్​ సిరీస్​ నెగ్గిన ఆస్ట్రేలియా (Australia) మొదటి స్థానానికి ఎగబాకింది. 119 రేటింగ్ పాయింట్స్​తో మొదటి స్థానం కైవసం చేసుకుంది.

గతేడాది ప్రపంచ టెస్టు ఛాంపియన్​షిప్​ను సొంతం చేసుకున్న న్యూజిలాండ్ (New Zealand).. ప్రస్తుతం 117 రేటింగ్ పాయింట్స్​తో రెండో స్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్ నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. భారత్​పై విజయం అనంతరం దక్షిణాఫ్రికా (South Africa) తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఐదో స్థానానికి ఎగబాకింది. దీంతో పాకిస్థాన్​ ఆరో స్థానానికి పడిపోయింది. శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాబ్వే తమ స్థానాలను సుస్థిరం చేసుకున్నాయి.

Also Read: Cameron Boyce Double Hat-Trick: 4 బంతుల్లో 4 వికెట్లు.. డబుల్‌ హ్యాట్రిక్‌తో చరిత్ర సృష్టించిన ఆసీస్ బౌలర్‌!!

ఇదిలా ఉండగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23 సీజన్‌లో భాగంగా.. ఆసీస్ పాకిస్తాన్‌లో మూడు మ్యాచ్‌ల సిరీస్ కోసం ప‌ర్య‌టించ‌నుంది. కాగా 1998 తర్వాత ఆసీస్ జట్టు పాకిస్థాన్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. మరోవైపు స్వదేశంలో శ్రీలంకతో భారత్ (india) రెండు మ్యాచ్‌ల సిరీస్ ఆడనుంది. ఇక‌ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విషయానికి వస్తే.. టీమిండియా ఇప్పటివరకు 10 మ్యాచ్‌ల్లో 49.07 విజయ శాతంతో నాలుగు విజయాలు, మూడు ఓటములు, రెండు డ్రాలతో ఐదే ర్యాంక్‌లో కోన‌సాగుతోంది. మరోవైపు, ఆస్ట్రేలియా ఐదు మ్యాచ్‌లలో 86.66 విజయ శాతంతో నాలుగు విజయాలు, ఒక డ్రాతో రెండో స్థానంలో ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News