Australia Captain Aaron Finch Said My innings was very poor vs Sri Lanka in T20 World Cup 2022: శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో తాను చెత్తగా ఆడానని, తాను బ్యాటింగ్ చేసిన విధానం తనకే అసహ్యం వేసిందని ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని కొనియాడాడు. శ్రీలంక బౌలర్లు అద్భుత బంతులు వేశారని ఫించ్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా మంగళవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా సునాయాస విజయం సాధించింది. స్టొయినిస్ (59 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో ఆస్ట్రేలియా కెప్టెన్ ఆరోన్ ఫించ్ మాట్లాడుతూ... 'మ్యాచ్ గెలిచినందుకు చాలా సంతోషం. నా ఇన్నింగ్స్ మరీ పేలవంగా ఉంది. నేను బంతిని బాధలేకపోయాను. అయితే మా జట్టు బ్యాటింగ్ బాగుంది. పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉంది. అందుకే ఇన్నింగ్స్ ఆరంభంలో బ్యాటింగ్‌కు ఇబ్బంది అయ్యింది. చివరి వరకు క్రీజులో ఉండటం నాకు ముఖ్యం అనిపించింది. నేను హిట్టింగ్ చేస్తే కచ్చితంగా ఔట్ అయ్యేవాడిని' అని అన్నాడు.
'శ్రీలంక బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. పెర్త్ లాంటి పెద్ద మైదానాల్లో హార్డ్ లెంగ్త్‌లను పిక్ చేయడం కష్టం. ఈ విజయంతో మాకు రెండు పాయింట్లు రావడం సంతోషంగా ఉంది. మార్కస్ స్టోయినిస్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. బంతిని బాగా బాదాడు. స్టోయినిస్ ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతని ఇంటెంట్ చాలా ముఖ్యమైనది. టీ20ల్లో క్రీజులో ఉండడం చాలా ముఖ్యం. తదుపరి మ్యాచ్‌లో కూడా ఇదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తాం. ఇంగ్లండ్‌తో బిగ్ ఫైట్ ఖాయం. ఈవెంట్ ఏదైనా, ఫార్మాట్ ఏదైనా ఇంగ్లండ్‌తో మ్యాచ్ ప్రత్యేకం. ఆ మ్యాచ్ కోసం ఎదురు చూస్తున్నాం' అని ఆరోన్ ఫించ్ చెప్పాడు.
Marcus Stoinis with a historic knock in Perth 🙌
📺 Highlights: https://t.co/kW9LDPuZq7#T20WorldCup pic.twitter.com/5VC1toPiIA
— T20 World Cup (@T20WorldCup) October 25, 2022
ఈ మ్యాచులో ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. పథుమ్ నిస్సంక (40; 45 బంతుల్లో 2 ఫోర్లు), చరిత అసలంక (38 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), ధనంజయ డిసిల్వా (26; 23 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, అష్టన్ అగర్ తలో వికెట్ తీసారు. ఆసీస్ 16.3 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టొయినిస్ (59 నాటౌట్; 18 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లు) సునాయాస విజయాన్ని అందించాడు. ఆరోన్ ఫించ్ (31 నాటౌట్; 42 బంతుల్లో 1 సిక్స్) మరీ నెమ్మదిగా ఆడాడు.
Also Read: అబ్బా డేవిడ్ వార్నర్.. ఏమన్నా ఫీల్డింగ్ చేశావా! వీడియో చూసి తీరాల్సిందే
Also Read: World Dirtiest Man Dies: బలవంతంగా స్నానం చేయించారు.. ప్రపంచంలోనే అత్యంత మురికైన వ్యక్తి మృతి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook