ఆసియా క్రీడలు 2018: సౌరవ్ ఘోషల్‌కి కొద్దిలో గోల్డ్ మిస్.. దీపికా, జోష్నలకు కాంస్యం!

ఆసియా క్రీడలు 2018: కాంస్య పతకం గెల్చుకున్న ముగ్గురు భారతీయ స్క్వాష్ క్రీడాకారులు

Last Updated : Aug 25, 2018, 09:11 PM IST
ఆసియా క్రీడలు 2018: సౌరవ్ ఘోషల్‌కి కొద్దిలో గోల్డ్ మిస్.. దీపికా, జోష్నలకు కాంస్యం!

2018 ఆసియా గేమ్స్‌లో భాగంగా 7వ రోజైన శనివారం మహిళల సింగిల్స్ స్క్వాష్‌ సెమీస్ మ్యాచ్‌లో స్క్వాష్‌ క్రీడాకారిణి దీపికా పల్లికల్ కాంస్య పతకం గెలుచుకుంది. ఈ సెమీస్ మ్యాచ్‌లో మలేషియాకు చెందిన నికోల్ డేవిడ్‌తో తలపడిన దీపికా పల్లికల్ 0-3 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆసియా గేమ్స్‌లో ఆమె కాంస్య పతకంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. మహిళల సింగిల్స్ స్క్వాష్ విభాగంలో భారత్ కి చెందిన మరో స్క్వాష్ క్రీడాకారిణి జోష్న చినప్ప సైతం మలేషియాకు చెందిన శివసంగరి సుబ్రహ్మణ్యన్ చేతిలో ఓటమిపాలవడంతో కాంస్య పతకంతో వెనుదిరిగింది. 

Dipika Pallikal, Joshna Chinappa and Saurav Ghosal wins Bronze medals in Squash at Asian Games 2018

ఇదిలావుంటే, మరోవైపు పురుషుల సింగిల్స్ స్క్వాష్ విభాగంలోనూ భారత క్రీడాకారుడు సౌరవ్ ఘోషల్ కాంస్య పతకం సొంతం చేసుకున్నాడు. సెమీ ఫైనల్స్‌లో హాంగ్ కాంగ్‌కి చెందిన చున్ మింగ్ ఔతో పోరాడిన సౌరవ్ ఘోషల్ 2-3 తేడాతో ఓటమిపాలయ్యాడు. తొలుత 2-0తో చున్ మింగ్ పై ఆధిక్యం కనబర్చిన సౌరవ్.. ఆ తర్వాత 1 పాయింట్ తేడాతో ఓటమిచెందాడు. దీంతో మొత్తంగా 7వ రోజు స్క్వాష్ క్రీడలో 
 

Trending News