ఉత్కంఠకు గురిచేస్తున్న ఇండియా vs బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్ వివరాలు

ఆసియా కప్ 2018 ఇండియా vs బంగ్లాదేశ్ ఫైనల్ ఫైట్

Last Updated : Sep 28, 2018, 04:39 PM IST
ఉత్కంఠకు గురిచేస్తున్న ఇండియా vs బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్ వివరాలు

ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా నేడు ఇండియా vs బంగ్లాదేశ్ జట్ల మధ్య అంతిమ యుద్ధం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఆసియా కప్ ను కైవసం చేసుకోనుంది. ఒకవేళ ఆశించిన విధంగానే భారత్ ఈ ఆటలో గెలిస్తే, టీమిండియా 7వసారి ఆసియా కప్‌ను సొంతం చేసుకున్నట్టు అవుతుంది. భారత్, బంగ్లాదేశ్ క్రికెట్ ప్రియులను ఉత్కంఠకు గురిచేస్తోన్న ఈ ఆట ఎప్పుడు, ఎక్కడ జరగనుంది అనే వివరాలు ఇలా ఉన్నాయి.  

ఎప్పుడు..
సెప్టెంబర్ 28 శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ఆసియా కప్ 2018 టోర్నమెంట్‌లో భాగంగా భారత్ vs బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఎక్కడ..
దుబాయ్‌లోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా ఈ తుది సమరం జరగనుంది.

ఏ టీవీ ఛానెల్ ఈ క్రికెట్ మ్యాచ్‌ని ప్రత్యక్ష ప్రసారం చేయనుంది..
స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానెల్ భారత్ vs బంగ్లాదేశ్ ఫైనల్ మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేయనుంది.

టీమిండియా జట్టు ఆటగాళ్లు:
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధవన్, అంబటి రాయుడు, దినేశ్ కార్తిక్, ఎం.ఎస్. ధోని (వికెట్ కీపర్), కేదాక్ జాదవ్, రవింద్ర జడేజా, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, జస్ప్రిత్ బుమ్రా, మనీష్ పాండే, సిద్ధార్థ్ కౌల్, కేఎల్ రాహుల్, దీపక్ చాహర్.

బంగ్లాదేశ్ జట్టు ఆటగాళ్లు: 
మష్రాఫె బిన్ మొర్తాజ (కెప్టేన్), షకీబ్ అల్ హసన్, తమీమ్ ఇక్బాల్, మొహమ్మద్ మిథున్, లితన్ కుమార్ దాస్, ముష్‌ఫిఖుర్ రహీం, అరిఫుల్ హఖీ, మహ్మదుల్లా, మొసద్దిక్ హుస్సేన్ సైకత్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, మెహిది హసన్ మిరాజ్, నజ్ముల్ ఇస్లాం అపు, రుబేల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, అబు హైదర్ రోని.

Trending News