19 to 25 June 2023 Weekly Horoscope: ఈ వారం అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఊహించనంత డబ్బు, జాబ్, ప్రమోషన్స్!

Weekly Horoscope: వచ్చే వారం కొందరికి అదృష్టం పట్టనుంది. దీని వల్ల కొన్ని రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 18, 2023, 08:53 PM IST
19 to 25 June 2023 Weekly Horoscope: ఈ వారం అదృష్ట రాశులు ఇవే.. వీరికి ఊహించనంత డబ్బు, జాబ్, ప్రమోషన్స్!

19 to 25 June 2023 Weekly Horoscope: జ్యోతిష్యం దృష్ట్యా, రాబోయే వారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ వారమే శనిదేవుడు కుంభరాశిలో తిరోగమనం చెందనున్నాడు. అంతేకాకుండా బుధుడు కూడా అస్తమించబోతున్నాడు. ఈ గ్రహాల గమనంలో మార్పు కారణంగా కొన్ని రాశులవారు బంపర్ ప్రయోజనాలను పొందనున్నారు. జూన్ 19, 2023 నుండి జూన్ 25, 2023 వరకు ఏయే రాశులకు కలిసి రానుందో తెలుసుకుందాం. 

వృషభం:

ఉద్యోగం కోసం మీ అన్వేషణ ఫలిస్తుంది. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. మీరు ఏ పని చేపడితే అందులో విజయం సాధిస్తారు. మీరు ఎప్పుడూ మీ చుట్టూ ఉండే వారిని సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నించండి. 

మిథునరాశి:

ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు ఇంక్రిమెంట్ లేదా ప్రమోషన్ పొందే అవకాశం ఉంది. మీరు ఈ వారం కొందరిని కలిసే అవకాశం ఉంది. మీరు వారి నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది 

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి పెద్ద కంపెనీలో జాబ్ చేసే అవకాశం ఉంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఫ్యాషన్ డిజైనింగ్ మరియు హోటల్ రెస్టారెంట్లతో సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయం బాగుంటుంది. 

Also Read: Second Surya Grahan: 2023లో చివరి సూర్యగ్రహణం ఎప్పుడు? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది?

తులారాశి:

తుల రాశికి చెందిన వ్యక్తులు తమ ఆలోచనలతో ఇతరులను ప్రభావితం చేస్తారు. మీ పనికి ప్రశంసలు లభిస్తాయి.  వ్యాపారం వృద్ధి చెందుతుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. మీరు ఊహించలేనంత డబ్బు పొందుతారు.

మీనం:

ఆఫీసులో మీరు పెద్ద బాధ్యతను తీసుకుంటారు. ఈ వారం మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంది. మీరు ఆచితూచి మాట్లాడటం వల్ల మీ పని సులభంగా పూర్తవుతుంది. మీరు మీ లక్ష్యాన్ని సాధిస్తారు. 

Also Read: Mercury Set 2023: జూన్ 19న బుధుడి అస్తమయం.. 23 రోజులపాటు ఈరాశులకు నరకమే నరకం...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News