Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?

Vinayak Chaturthi 2021 date and time: వినాయక చతుర్థి సెప్టెంబర్ నెలలో కదా సెలబ్రేట్ చేసుకునేది.. ఇవాళ కూడా చేసుకుంటారా అనే సందేహం రావచ్చేమో. ఎందుకంటే ఈరోజు జరుపుకునే వినాయక చవితి అంతగా ప్రచారంలో లేకపోవడం ఒక కారణం అయితే.. అసలు ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం మరో కారణం. ఇంతకీ వినాయక చవితిని (Vinayaka chavithi 2021) సెప్టెంబర్‌లో కాకుండా ఇవాళ కూడా జరుపుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Jun 14, 2021, 10:58 AM IST
Vinayak Chaturthi 2021: వినాయక చతుర్థి ఇవాళ కూడా సెలబ్రేట్ చేసుకుంటారు తెలుసా ?

Vinayak Chaturthi 2021 date and time: వినాయక చతుర్థి సెప్టెంబర్ నెలలో కదా సెలబ్రేట్ చేసుకునేది.. ఇవాళ కూడా చేసుకుంటారా అనే సందేహం రావచ్చేమో. ఎందుకంటే ఈరోజు జరుపుకునే వినాయక చవితి అంతగా ప్రచారంలో లేకపోవడం ఒక కారణం అయితే.. అసలు ఈ విషయం చాలా మందికి తెలియకపోవడం మరో కారణం. ఇంతకీ వినాయక చవితిని (Vinayaka chavithi 2021) సెప్టెంబర్‌లో కాకుండా ఇవాళ కూడా జరుపుకోవడం వెనుకున్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

హిందూ క్యాలెండర్లో, ప్రతీ చాంద్రమాసంలో రెండు చతుర్థిలు ఉంటాయి. హిందూ గ్రంథాల ప్రకారం, చతుర్థి తిథిని గణేశుడి తిథిగా భావిస్తారు. అమావాస్య తరువాత వచ్చే శుక్ల పక్షం చతుర్థిని వినాయక చతుర్థి అని పిలుస్తారు. పూర్ణిమ తరువాత వచ్చే కృష్ణ పక్షం చతుర్థిని సంకష్తి చతుర్థి అని పిలుస్తారు. వినాయక చతుర్థి వ్రతం, ఉపవాసం చేయాలనుకునే వారు ప్రతీ నెలా చేయవచ్చు కానీ భాద్రపద మాసంలో వచ్చే చతుర్థినే అతి ముఖ్యమైన వినాయక చతుర్థిగా గణేష్ భక్తులు భావిస్తారు (Vinayaka Chavithi 2021 date and time).

Also read: Lakshmi devi's birth: లక్ష్మీ దేవి పుట్టుకకు కారణం ఏంటి ? లక్ష్మీ దేవి ఎక్కడ, ఎలా, ఎప్పుడు పుట్టింది ?

Ganesh Chaturthi 2021 date and time: వినాయక చవితి 2021 తేదీ

భాద్రపద మాసం సమయంలో వచ్చే వినాయక చతుర్థినే గణేష్ చతుర్థి అని కూడా అంటారు. గణేష్ చతుర్థిని గణేశుడి పుట్టిన రోజుగా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. సెప్టెంబర్‌లో జరుపుకునే వినాయక చవితిలో బేసీ సంఖ్యలో మూడు రోజులు లేదా ఐదు రోజులు, లేదా ఏడు, తొమ్మిది, పదకొండు రోజుల పాటు గణపయ్యను పూజించి ఆయన విగ్రహాన్ని నీళ్లలో నిమజ్జనం చేయడం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది అలా భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి సెప్టెంబర్ 10న (Ganesh Chaturthi 2021 date and time) వస్తోంది. 

ఇక ప్రస్తుత విషయానికొస్తే.. ముందు చెప్పుకున్నట్టుగా జ్యేష్ఠ మాసంలో (Jyesta masam) శుక్ల చతుర్థి నాడు జరుపుకునే వినాయక చతుర్థిని జూన్ 24న.. అంటే ఇవాళే జరుపుకుంటారన్నమాట. 

తిథి ప్రకారం జూన్ 13న రాత్రి 9.40 కి ప్రారంభమయ్యే శుక్ల చతుర్థి తిథి జూన్ 14న రాత్రి 1.34 వరకు ఉంటుంది. 

Also read: Sai Baba puja vidhi: సాయి బాబాను ఎలా పూజిస్తే ఏమేం ఫలితాలు కలుగుతాయి ?

Ganesh Puja vidhanam importance: గణేష్ పూజ విధానం ప్రాముఖ్యత
గణేష్ పూజలో ఆ గణేశుడిని ఆరాధించడం ద్వారా అన్ని విఘ్నాలు తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. అందుకే ఏ పూజ చేసినా, ఏ పని తలపెట్టినా.. అది దిగ్విజయంగా పూర్తయ్యేందుకు ముందుగా ఆ గణేష్ పూజ చేయడం ఆనవాయితి. అత్యంత భక్తిశ్రద్ధలతో ఆ వినాయకుడిని పూజించే (Vinayak puja vidhi) వారికి వారి వారి పనుల్లో ఎలాంటి అవరోధాలు రావని చెబుతుంటారు. వ్యాపారం చేసుకునే వారికి వ్యాపారంలో వృద్ధి కనబడుతుందనేది బలమైన విశ్వాసం. 

గణపతి పూజ చేసిన తరువాత చేసే దానధర్మాలతో పుణ్యం పొందుతారేది భక్తుల విశ్వాసం. బ్రహ్మ ముహూర్తాలో మేల్కొని స్నానం చేసి, గణపతిని పూజించి, ఓం గణపతి నమహః అంటూ జపం చేయడం మరింత ఫలదాయకం అని పెద్దలు చెబుతుంటారు. ఆ బొజ్జ గణపయ్యకు ఇష్టమైన ఉండ్రాళ్ల పాయాసం (Vundralla paayasam) ప్రసాదంగా సమర్పించి, పూజ తరువాత ఆ మహా ప్రసాదాన్ని (Prasadam for lord Ganesh) భక్తులకు పంచి పెట్టడంతో వినాయక చవితిని జరుపుకున్న భక్తులకు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది, కోరుకున్న కోరికలు నెరవేరుతాయని ఆధ్యాతిక శాస్త్రాలు (Spiritual) చెబుతున్నాయి.

Also read: Today Horoscope In Telugu: నేటి రాశి ఫలాలు 14 జూన్ 2021 Rasi Phalalu, ఓ రాశివారి చేతికి ఆస్తి

Also read: Yadadri Temple Photos: యాదాద్రిలోని శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఫొటోస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News