Venus Transit 2022: మేష రాశిలోకి శుక్రుడు... ఎవరికి శుభం, ఎవరికి అశుభం.. ఏయే రాశులపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..

Venus Transition into Aries : గ్రహాలు రాశిచక్రం మారిన ప్రతీసారి రాశిచక్రంలోని 12 రాశుల వారిపై దాని ప్రభావం ఉంటుంది. ఈ నెల 23న శుక్రుడు మేష రాశిలోకి ప్రవేశిస్తుండటంతో దాని ప్రభావం ఏయే రాశుల వారిపై ఎలా ఉంటుందంటే..   

Written by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 08:27 PM IST
  • ఈ నెల 23న మేష రాశిలోకి శుక్రుడు
  • శుక్రుడు రాశిచక్రం మారడంతో అన్ని రాశుల వారిపై దాని ప్రభావం
  • ఏయే రాశుల వారిపై ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి
Venus Transit 2022: మేష రాశిలోకి శుక్రుడు... ఎవరికి శుభం, ఎవరికి అశుభం.. ఏయే రాశులపై దాని ప్రభావం ఎలా ఉంటుందంటే..

Venus Transition into Aries : జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల రాశిచక్రంలో మార్పు చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. గ్రహాల రాశిచక్రంలోని మార్పులు అన్ని రాశుల వారిపై ప్రభావం చూపిస్తాయి. ఆయా గ్రహాల సంచారాన్ని బట్టి ఆయా రాశుల వారికి శుభ, అశుభ ఫలితాలు ఉంటాయి. ఈ నెల 15న సూర్యుడి రాశిచక్రం మారింది. ప్రస్తుతం సూర్యుడు వృషభరాశిలో సంచరిస్తున్నాడు. సూర్యుని తర్వాత కుజుడు మీనరాశిలోకి ప్రవేశించాడు.  మే 23న శుక్రుడు మేషరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు రాశి మారడం మేషం నుండి మీనం వరకు.. ఏయే రాశుల వారిపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకోండి..

మేషం - కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారంలో ఇబ్బందులు ఉండవచ్చు. స్నేహితుల మద్దతు పొందుతారు. ఇతరులకు మీరు దుస్తులు కానుకగా అందజేస్తారు. మీ పిల్లలతో సంతోషంగా గడుపుతారు. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. జీవిత భాగస్వామితో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు.

వృషభం - ఓపిక చాలా అవసరం. మనసులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. ఉద్యోగం మారే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్ కూడా రావొచ్చు. పిల్లల ఆరోగ్య సమస్యలు కొంత బాధిస్తాయి. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. స్నేహితులు, సన్నిహితుల మద్దతు పొందుతారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. సోదరులతో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు.

మిథునం - మనస్సు కలత చెందుతుంది. విద్యా రంగంలో సత్ఫలితాలు సాధిస్తారు. తల్లి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. కుటుంబం మద్దతు లభిస్తుంది. పట్టరాని కోపాన్ని తగ్గించుకోండి. జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలు కొంత ఆందోళనకు గురిచేస్తాయి. ఉద్యోగంలో అధికారులతో విభేదాలు ఏర్పడవచ్చు.

కర్కాటకం - మీ కోపమే మీకు శత్రువు. విద్యా విషయాల్లో ఆటంకాలు ఏర్పడవచ్చు. కుటుంబ సభ్యుల నుండి కొంత ధనం అందుతుంది. మతపరమైన సంగీతం మిమ్మల్ని ఆకర్షిస్తుంది. చేపట్టిన పనుల్లో తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. కుటుంబంలో ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగించవచ్చు.

కన్య - ఉద్యోగంలో ప్రమోషన్ అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరుగుతుంది. కొత్త వాహనం తీసుకుంటారు. శారీరకంగా ఫిట్‌గా ఉంటారు. ఉద్యోగ పరంగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. ఆఫీసులో కొన్ని ఇబ్బందులు ఉండవచ్చు. పని భారం పెరుగుతుంది. మనశ్శాంతి కోసం ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తుల - స్వీయ నిగ్రహంతో ఉండండి. ఓపిక చాలా అవసరం. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితుని నుంచి కొంత డబ్బు పొందుతారు. ఆత్మవిశ్వాసం కొరవడుతుంది. తీపి పదార్థాలు తినాలనిపిస్తుంది. పాత స్నేహితులను కలుస్తారు. మనస్సు చంచలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడుతాయి. 

వృశ్చికం - మనస్సులో నిరాశ, అసంతృప్తి ఉండవచ్చు. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. పని భారం, ఒత్తిడి పెరుగుతాయి. ఉద్యోగంలో పురోగతికి అవకాశాలు ఉండవచ్చు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీసులో మీ పనికి తగిన గుర్తింపు దక్కవచ్చు లేదా దకక్కపోవచ్చు.

ధనుస్సు - మతపరమైన పనుల్లో నిమగ్నత పెరుగుతుంది. కుటుంబ జీవితం కష్టంగా ఉంటుంది. వాహన కొనుగోలు సంతోషాన్నిస్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆత్మవిశ్వాసం సడలకుండా చూసుకోండి. అధికారులు ఉద్యోగంలో పదోన్నతి పొందుతారు. తోబుట్టువులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

మకరం - ఒక క్షణం కోపం, ఒక క్షణం సంతృప్తి ఉంటుంది. కొన్నిసార్లు హ్యాపీనెస్ పెరుగుతుంది. బట్టలు మొదలైన వాటిపై ఖర్చులు పెరగవచ్చు. స్నేహితుని సహాయంతో వ్యాపార అవకాశం లభిస్తుంది. ఆత్మవిశ్వాసం తగ్గుతుంది. మనస్సు చంచలంగా ఉంటుంది. ఎవరితో మాట్లాడినా ఓపికగా వ్యవహరించండి. కోపం పనికిరాదని గుర్తుంచుకోండి.

కుంభం - ఉద్యోగ ప్రయత్నాలు చేస్తారు. పోటీ పరీక్షలు లేదా ఇంటర్వ్యూలో పాల్గొంటారు. ప్రయాణ ఖర్చులు పెరగవచ్చు. మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెట్టాలి. విద్యాపరమైన పరిశోధన పనుల్లో సంతోషకరమైన ఫలితాలు ఉంటాయి. అయితే ఓపిక అవసరం. మనస్సు చంచలంగా ఉంటుంది.

మీనం - మనశ్శాంతి ఉంటుంది, కానీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. కుటుంబంలో మతపరమైన కార్యక్రమాలు జరుగుతాయి. చేపట్టిన పనుల్లో కుటుంబం మద్దతు లభిస్తుంది. కోపాన్ని తగ్గించుకోండి. కుటుంబంతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అడుగులు వేస్తారు.

Also Read: Adhi Pinishetty Wedding: రచ్చ లేపారుగా.. ఆది-నిక్కీ హల్దీ ఫంక్షన్‌లో నాని, సందీప్ కిషన్ డ్యాన్స్...

Also Read: Vasu Tips for Money: ఈ 6 వాస్తు టిప్స్ పాటిస్తే మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

Trending News