Venus transit 2023: గాంధీ జయంతి రోజు శుక్రుడి రాశిలో పెను మార్పు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Shukra Gochar 2023: అక్టోబర్ నెల ప్రారంభంలో శుక్రుడి గమనంలో పెను మార్పు రాబోతుంది. ఇది మూడు రాశులవారి జీవితాలను మార్చేయనుంది. వీరు ఎప్పుడూ చూడనంత డబ్బును చూస్తారు. వారెవరో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 19, 2023, 04:46 PM IST
Venus transit 2023: గాంధీ జయంతి రోజు శుక్రుడి రాశిలో పెను మార్పు.. ఈ 3 రాశులకు లక్కే లక్కు..

Venus transit 2023 October: గ్రహాల కదలిక మానవుని జీవితంపై పెను ప్రభావాన్ని చూపుతుంది. అష్ట గ్రహాల్లో శుక్రుడు కూడా ఒకరు. భూమి దగ్గరగా ఉండే ఫ్లానెట్ ఇది. అందుకే భూమి, శుక్రుడిని కవల గ్రహాలు అని పిలుస్తారు. పురాణాల ప్రకారం, రాక్షసుల గురువైన శుక్రాచార్యుడి పేరును ఈ గ్రహానికి పేరు పెట్టారు. లవ్, రొమాన్స్, లగ్జరీ మరియు డబ్బుకు కారకుడిగా శుక్రుడిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో శుక్రుడిని శుభగ్రహంగా పేర్కొంటారు. వచ్చే నెల 02న శుక్ర గ్రహం తన రాశిని మార్చి సింహరాశిలోకి ప్రవేశించబోతుంది. దీంతో మూడు రాశులవారి జీవితం వెలుగులమయం కానుంది. ఆ రాశులు ఏవో ఓ లుక్కేద్దాం. 

సింహం - ఇదే రాశిలో శుక్రుడి సంచారం జరగబోతుంది. దీంతో ఈ రాశి వారు అనుకున్నది సాధిస్తారు. కెరీర్ లో మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం డబల్ అవుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీకు సంతానానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఉంది.
వృషభం – వృషభరాశిని పాలించే గ్రహం శుక్రుడు. అందుకే వృషభరాశి వారికి శుక్రుడి కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. మీరు లగ్జరీ లైఫ్ ను గడుపుతారు. ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మీరు ఏ పనిని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు కోరుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటారు.

Also Read: Guru Vakri 2023: రాబోయే 4 నెలలపాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. ఇందులో మీ రాశి ఉందా?

తులారాశి- తులారాశిని పాలించే గ్రహం కూడా శుక్రుడే. దీంతో అదృష్టం ఎల్లప్పుడూ మీ వెంటే ఉంటుంది. మీరు ప్రతి కార్యాన్ని సులభంగా పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీ ఆర్థిక సమస్యలన్నీ దూరమవుతాయి. వ్యాపారులు మంచి లాభాలను గడిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. 

(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)

Also Read: Rishi Panchami 2023: ఋషి పంచమి తిథి, శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News