Art of living: ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు అరుదైన గౌౌరవం లభించింది. వ్యవస్థాపకులైన రవిశంకర్‌కు విశిష్టమైన గుర్తింపు వచ్చింది. అమెరికా విశ్వవిద్యాలయం గౌరవించింది.
అమెరికా విశ్వవిద్యాలయం ఆర్ట్ ఆఫ్ లివింగ్( Art of living )వ్యవస్థాపకులైన రవిశంకర్ ( Ravi shankar )కు అరుదైన గౌరవంతో సత్కరించింది. ప్రపంచ శాంతియత్నాలు, మానవతావాదం, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచవ్యాప్తంగా వివిధ మత విశ్వాసాల మధ్య సామరస్యతకు చేస్తున్న కృషికి గుర్తింపు ఇస్తున్నట్టు ప్రకటించింది. రవిశంకర్‌కు విశ్వ వారసత్వ రాయబారిగా ప్రత్యేకమైన గుర్తింపు ఇచ్చింది.
అమెరికాలోని బోస్టన్‌లో నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ( Boston north western university )ఈ మేరకు ప్రకటించింది. విశ్వమానవ రాయబారి ( Global citizenship ambassador )గా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే క్రమంలో మొట్టమొదటగా రవిశంకర్ కంటే ఉత్తమమైన వ్యక్తిని ఊహించలేకపోయామని యూనివర్శిటీ తెలిపింది. ఉత్తమ మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచే రవిశంకర్‌తో చర్చా కార్యక్రమం ప్రారంభించామని వెల్లడించింది. పరస్పర శాంతి, అనువైన వాతావరణం కోసం రవిశంకర్ అవిశ్రాంతంగా పోరాడుతున్నట్టు నార్త్ వెస్టర్న్ యూనివర్శిటీ ప్రకటించింది.
Also read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 9, 2021, ఓ రాశి వారికి ఆకస్మిక ధనలాభం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook