Ugadi 2022 Panchangam, rashifalalu : తెలుగు కొత్త సంవత్సరం ప్రారంభమైంది. ఈ శుభకృత్ నామ సంవత్సరం..ఆ రాశులవారికి ప్రేమ అందించనుంది. భాగస్వామిని తెచ్చిపెట్టనుంది. ఆ వివరాలు తెలుసుకుందాం.
తెలుగు కొత్త సంవత్సరాది ఉగాది వచ్చేసింది. అందరూ ఉగాది పంచాంగాలు తిరగేస్తున్నారు. పంచాంగ పఠనాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది తమకు ఎలా ఉంటుందో అనే ఆసక్తితో పంచాంగం చెప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ముఖ్యంగా కొన్ని రాశులవారికైతే..ఈ శుభకృత్ నామ సంవత్సరం ప్రేమను అందిస్తుందని పండితులు చెబుతున్నారు. మీకు నచ్చిన భాగస్వామి లభిస్తుందంటున్నారు. ఆ రాశుల గురించి పరిశీలిద్దాం. ఈ రాశులవారికి ప్రేమ పెళ్లిళ్లవుతాయంటున్నారు.
ప్లవ నామ సంవత్సరం పూర్తి చేసుకుని శుభకృత్ నామ సంవత్సరంలో అడుగుపెట్టాము. 1962-63న వచ్చి శుభకృత్ నామ సంవత్సరం తిరిగి ఇప్పుడు వచ్చింది. పెళ్లి కావల్సినవారు, ప్రేమలో మునిగినవారిలో ఆ 7 రాశులవారికి ఇది గుడ్‌న్యూస్. ఆ ప్రేమ పెళ్లిళ్లు సక్సెస్ కావడం, వైవాహిక జీవితం రొమాంటిక్‌గా ఉండటం జరుగుతుందట.
ధనస్సు రాశి వారికి ఈ సంవత్సరం ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. ఇప్పటికే రిలేషన్షిప్ ఉంటే భాగస్వామితో సంబంధం కొనసాగుతుంది. ప్రేమ..పెళ్లి వరకూ వెళ్తుంది. కొత్తగా ప్రేమలో పడతారు. ఇక మీనరాశివారు రిలేషన్షిప్లో ఉంటే.. ముందుగా వారి బంధంలో కొత్త ఉత్తేజం వస్తుంది. అంతేకాకుండా ఆ బంధం మరింత అభివృద్ధి చెందుతుంది. ఒకరిపై మరొకరిని నమ్మకం పెరుగుతుంది. ఇక మకర రాశివారు..జీవిత భాగస్వామిని బాగా అర్దం చేసుకుంటారు. కుజ గ్రహం కదలికల కారణంగా ఆగస్టు నాటికి సాన్నిహిత్యం మరింతగా పెరుగుతుంది. కొన్ని అడ్డంకులు ఎదురైనా..ప్రేమ వివాహం తప్పకుండా జరుగుతుంది.
ఇక ప్రేమ పరంగా కన్యా రాశి వారిని అదృష్ట వంతులుగా పరిగణిస్తారు. ప్రస్తుతం సింగిల్‌గా ఉన్నవారు వచ్చే సంవత్సరం పాత స్నేహితుడు లేదా కొంతమంది కుటుంబ సభ్యుల ద్వారా తమ జీవిత భాగస్వామిని కనుగొంటారు. తొలిచూపులోనే ప్రేమలో పడతారట. ఇక వృశ్చిక రాశివారికి ఈ ఏడాది పూర్తిగా అదృష్టమే. సింగిల్‌గా ఉన్నవారు పాత స్నేహితుడు లేదా కొంతమంది కుటుంబ సభ్యుల ద్వారా తమ జీవిత భాగస్వామిని కనుగొంటారు.
మీనం రాశివారిలో ఇప్పటికే రిలేషన్‌లో ఉంటే ఆ బంధానికి కొత్త ఉత్తేజం కలుగుతుంది. ఆ బంధం మరింతగా పెరుగుతుంది. ఒకరిపై మరొకరు నమ్మకాన్ని పెంచుకుంటారు. ఇక కర్కాటక రాశివారు జీవిత భాగస్వామిని కలుస్తారు. చంద్రుడు అధిపతిగా ఉండటం కారణంగా ఈ రాశివారు జీవిత భాగస్వామితో చాలా విశ్వాసం చూపిస్తారు. ఒకరిపై మరొకరికి ఎమోషన్ పెరుగుతుంది.
Also read: Ugadi 2022: ఉగాది పండుగ పూట పాటించాల్సిన నియమాలు... చేయాల్సిన, చేయకూడని పనులు ఇవే...
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook