Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు (Tirumala Special Darshan Ticket) విడుదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శ్రీవారి దర్శనం టిక్కెట్లను విడుదల చేశారు.

Last Updated : Nov 30, 2020, 06:23 PM IST
  • చిత్తూరు జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రం తిరుమల
  • శ్రీవారి ప్రత్యేక దర్శన టిక్కెట్లు విడుదల
  • దర్శనానికి కోవిడ్ నిబంధనలు పాటిస్తున్న టీటీడీ
Tirumala: శ్రీవారి ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల

శ్రీవారి భక్తులకు తీపికబురు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల ఆలయంలో ప్రత్యేక దర్శనం టిక్కెట్లు విడుదలయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అధికారులు శ్రీవారి దర్శనం టిక్కెట్లను విడుదల చేశారు. ప్రతినెల మాదిరిగానే డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం టికెట్ల కోటాను టీటీడీ తమ వెబ్‌సైట్ ద్వారా భక్తులకు అందుబాటులోకి తెచ్చింది.

నేటి నుంచి ప్రతిరోజూ వేకువజామున 3 గంటలకు దర్శనం టిక్కెట్ విక్రయాలు ప్రారంభం కానున్నాయి. రాత్రి 11 గంటల వరకు తిరుమల శ్రీవారి రూ.300 ప్రత్యేక దర్శన టిక్కెట్లను విక్రయించనున్నారు. ప్రతిరోజూ 19 వేల చొప్పున టిక్కెట్లు భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఏపీలో అందుకు తగిన నిబంధనలు అనుసరించి భక్తులను దర్శనానికి అనుమతిస్తున్నారు.

Also Read :​ Health Benefits Of Bitter Melon: కాకరకాయతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలా!

 

శ్రీవారి ప్రత్యేక దర్శనానికి భక్తులు టిక్కెట్లను రూ.300 చెల్లించి టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో కొనుగోలు చేయాల్సి ఉంటుంది దేవస్థాన బోర్డు అధికారులు సూచించారు. భక్తులకు ఒకరోజు ముందుగా దర్శనం టిక్కెట్లు కొనుగోలు చేయాలి. మరుసటిరోజు ఆ భక్తులకు ఏ కోవిడ్19 లక్షణాలు లేకపోతే శ్రీవారి ప్రత్యేక దర్శనానికి అనుమతి కల్పించనున్నారు.

Also Read : Lower Interest Rates On Home Loans: హోమ్ లోన్ తీసుకునే వారికి శుభవార్త.. అతి తక్కువ వడ్డీకే రుణాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News