Trigrahi Yoga in Scorpio: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి అరిష్టం తప్పదు!

Trigrahi Yoga: మూడు ప్రధాన గ్రహాల కలయిక జ్యోతిషశాస్త్రపరంగా చాలా ముఖ్యమైనది. వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక వల్ల త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల నాలుగు రాశులవారు తీవ్రంగా నష్టపోనున్నారు.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 20, 2022, 09:03 AM IST
  • ఆస్ట్రాలజీలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది
  • వృశ్చికరాశిలో సూర్యుడు, బుధుడు మరియు శుక్రుడు కలయిక
  • త్రిగ్రాహి యోగం వల్ల ఈ 4 రాశులవారికి తీవ్ర ఇబ్బందులు
Trigrahi Yoga in Scorpio: వృశ్చికరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ 4 రాశుల వారికి అరిష్టం తప్పదు!

Trigrahi Yoga formed in Scorpio: అంతరిక్షంలో గ్రహాల సంచారం చాలా ముఖ్యమైనది. రీసెంట్ గా మూడు గ్రహాలు అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించాయి. వృశ్చికరాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం (Trigrahi Yoga) ఏర్పడుతుంది. సూర్యభగవానుడు కుజుడు రాశిలోకి ప్రవేశించడం వల్ల నాలుగు రాశులవారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. దీంతో ఈ రాశులవారు వృత్తి, వ్యాపార మరియు ఆర్థిక విషయాల్లో నష్టపోతారు. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం. 

మేషం (Aries): సూర్యుడు వృశ్చికరాశిలోకి ప్రవేశించడం వల్ల మేషరాశి వారు అశుభ ఫలితాలను ఎదుర్కోంటారు. ఆర్థిక పరిస్థితి దెబ్బతింటుంది. ఈసమయంలో మీరు ఖర్చులను నియంత్రించుకోండి. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదుర్కోవచ్చు. పరిహారంగా రోజూ మీరు సూర్యుడిని పూజించండి. 
వృశ్చిక రాశి (Scorpio): వృశ్చిక రాశిలో సూర్యుని రాకతో మీ వైవాహిక జీవితంలో కల్లోలం ఏర్పడవచ్చు. భాగస్వామితో వాదించడం వల్ల సంబంధం చెడిపోతుంది. మీ కెరీర్‌లో కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం దెబ్బతినవచ్చు. వ్యాపారంలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పరిహారంగా ప్రతిరోజూ గాయత్రీ మంత్రాన్ని జపించండి.
కన్యారాశి (Virgo): సూర్యుని సంచారం ఈరాశివారికి శుభప్రదంగా ఉండదు. వీరు భారీగా డబ్బు నష్టపోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఆర్డర్ లు రావు. మీ ఆత్మవిశ్వాసం లోపిస్తుంది. మీ వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. మీ ప్రేమ సంబంధం చెడిపోయే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈసమయం అంతగా కలిసిరాదు. పరిహారంగా అదిత్య హృదయాన్ని పఠించండి. 
ధనుస్సు రాశి (Sagittarius): సూర్యుని సంచారం ధనుస్సు రాశి వారి ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఈ రాశి వారు హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో సహోద్యోగులతో విభేదాలు రావచ్చు. కుటుంబ సభ్యులతో గొడవలు వచ్చే అవకాశం ఉంది. డబ్బు వృథా అవుతుంది. ఉద్యోగస్తులు నిరాశ చెందుతారు. 

Also Read: December 2022 Horoscope: డిసెంబరులో ఈ 3 రాశులవారు బంపర్ బెనిఫిట్స్ పొందనున్నారు...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News