Trigrahi Yoga In Virgo 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక గ్రహం రాశిచక్రాన్ని మార్చినప్పుడు లేదా ఏదైనా రాశిలో మరొక దానితో కలిసినప్పుడు దాని ప్రభావం మెుత్తం 12 రాశులవారిపై ఉంటుంది. వైభవాన్ని, ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు సెప్టెంబర్ 24న కన్యారాశిలోకి ప్రవేశిస్తాడు. ఇప్పటికే బుధుడు మరియు సూర్యుడు కన్యారాశిలో కూర్చుని ఉన్నారు. కన్యారాశిలో ఈ మూడు గ్రహాల కలయిక వల్ల త్రిగ్రాహి యోగం (Trigrahi Yoga In Virgo 2022) ఏర్పడుతుంది.
సెప్టెంబరు 26 నుంచి దేవీ నవరాత్రులు కూడా ప్రారంభమవుతున్నాయి. నవరాత్రుల్లో త్రిగ్రాహి యోగం ఏర్పడటాన్ని శుభప్రదంగా భావిస్తారు. నవరాత్రులలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం వల్ల ఈ రాశుల వారికి గ్రహాల అనుకూల ప్రభావాలతో పాటు దుర్గామాత అనుగ్రహం కూడా ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.
ఈ రాశులపై త్రిగ్రాహి యోగ ప్రభావం
ధనుస్సు (Sagittarius): త్రిగ్రాహి యోగం వల్ల వృత్తి, వ్యాపార రంగాలలో రాణిస్తారు. కొత్త జాబ్ ఆఫర్ ను పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో భారీ లాభాలు ఉంటాయి. విదేశాలకు సంబంధించిన వ్యాపారం చేసే వ్యక్తులు ఈ సమయంలో బాగా ప్రయోజనం పొందుతారు. వ్యాపారులు పెద్ద పెద్ద డీల్స్ కుదుర్చుకుంటారు.
వృశ్చికం (Scorpio): నవరాత్రులలో త్రిగ్రాహి యోగం ఏర్పడటం మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది, ఎందుకంటే ఈ యోగం మీ రాశి నుండి 11 వ ఇంట్లో సంచరిస్తాడు. ఇది ఆదాయ, లాభాల ఇల్లుగా పరిగణిస్తారు. మీ ఆదాయం పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
సింహం (Leo): త్రిగ్రాహి యోగం మీ రాశి నుండి రెండో ఇంట్లో ఏర్పడతుంది. దీని వల్ల సంపద, ప్రతిష్టలు పెరుగుతాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. బిజినెస్ విస్తరిస్తుంది.
Also Read: Shukra Pradosh Vrat 2022: శుక్ర ప్రదోష వ్రతం ఇలా చేస్తే.. ఇక మీకు దేనికీ లోటు ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook