Horoscope Today January 29 2022: నేటి రాశి ఫ లాలు.. ఆ రాశి వారికి ధన, ధాన్య లాభాలు!!

మిథునం, వృశ్చిక రాశి వారికి పూర్తి శుభకాలం నడుస్తోంది. గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 29, 2022, 08:59 AM IST
  • శనివారం .. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశి వారికి ధన, ధాన్య లాభాలు
Horoscope Today January 29 2022: నేటి రాశి ఫ లాలు.. ఆ రాశి వారికి ధన, ధాన్య లాభాలు!!

Today's Horoscope January 29 2022: నేటి రాశి ఫలాలను ఓసారి గమనిస్తే.. కొన్ని రాశుల వారికి మంచి సమయం ఉంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. 

Aries - మేషం: అన్నిరంగాల వారికీ మంచి వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. కుటుంబం, బంధువులతో ఆనందంగా గడుపుతారు. అనవసర ధనవ్యయం ఉంది. ఇష్ట దైవారాధన మానవద్దు.

Taurus - వృషభం: కీలక వ్యవహారాల్లో శ్రద్ధ అవసరం. శారీరక శ్రమ పెరగుతుంది. కుటుంబ సభ్యుల మాటలకు గౌరవం ఇవ్వడం మంచిది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. లలితాదేవి నామాన్ని స్మరించాలి.

Gemini - మిథునం: శుభ కాలం నడుస్తోంది. గొప్ప ఫలితాలు పొందుతారు. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. శ్రీవేంకటేశ్వరుడిని ఆరాధించండి.

Cancer - కర్కాటకం: కీలక సమస్యను పరిష్కారం అవుతాయి. శత్రువులపై విజయం సాధించగలుగుతారు. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఇష్టదైవ దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది.

Leo - సింహం: కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. శత్రువులు మీ మీద విజయం సాధించలేరు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దుర్గాస్తుతి చదవాలి.

Also Read: Emotional Eating: ఎమోషనల్ ఈటింగ్ అంటే ఏంటి.. ఆ సమస్యను ఎలా అధిగమించాలి

Virgo - కన్య: అనవసర ఖర్చు జరిగే సూచన ఉంది. మీ పై అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచింది. శ్రీశివపార్వతులను పూజించడం శుభకరం.

Libra - తుల: ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ముందు అనుకున్న పనులు జరుగుతాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది.

Scorpio - వృశ్చికం: మంచి సమయం నడుస్తోంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధు, మిత్రుల సహకారం ఉంటుంది. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. శని శ్లోకం చదవాలి.

Sagittarius - ధనుస్సు: ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. బంధు, మిత్రుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. ధన, ధాన్య లాభాలు ఉన్నాయి. కుటుంబంతో హాయిగా గడుపుతారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

Capricorn - మకరం: అన్ని రంగాల్లో మనో ధైర్యంతో ముందుకు సాగాలి. బుద్ధిబలాన్ని ఉపయోగించి ఆటంకాలను అధిగమిస్తారు. దగ్గరివారితో ఆచితూచి వ్యవహరించాలి. డబ్బు విషయంలో కుటుంబంతో చర్చించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. వినాయకుడిని ఆరాధిస్తే మంచిది.

Also Read: Cheetah: మూడు తలల చిరుత.. మంత్ర ముగ్ధులను చేస్తోన్న అతని ఫోటోగ్రఫీ

Aquarius - కుంభం: కాస్త మిశ్రమ కాలం నడుస్తోంది. శారీరక శ్రమ పెరుగుతుంది. బంధువులతో గొడవలకు దిగకపోవడమే మంచిది. అనవసర ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. దైవారాధన మానవద్దు.

Pisces - మీనం: అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాలి. బంధువులతో విబేధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనవసర డబ్బు ఖర్చు జరగొచ్చు. విష్ణు నామస్మరణ మేలు చేస్తుంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News