Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!

Today's Horoscope January 23 2022: వృషభం రాశి వారికి పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 23, 2022, 07:19 AM IST
  • ఆదివారం.. మీ రాశి ఫలాలు
  • ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే
  • ఆ రాశి వారికి అన్ని మిశ్రమ ఫలితాలే
Horoscope Today January 23 2022: నేటి రాశి ఫలాలు.. ఆ రాశి వారికి మిశ్రమ కాలం, అప్రమత్తంగా ఉండాలి!!

Today's Horoscope January 23 2022: నేటి రాశి ఫలాలను గమనిస్తే.. కొన్ని రాశుల వారికి పూర్తి అనుకూల సమయం నడుస్తోంది. మరికొన్ని రాశుల వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అమృత ఘడియలు తెల్లవారుజామున 3.19 నుంచి 4.54 వరకు ఉన్నాయి. దుర్ముహూర్తం సాయంత్రం 4.16 నుంచి 5.01 వరకు ఉంది. 

Aries - మేషం: ఈరోజు ముఖ్య పనులను ప్రారంభిస్తే సఫలం అవుతాయి. పరిస్థితులకు తగ్గట్టు ముందుకు సాగాలి. సమయం అన్ని విధాలా సహకరిస్తోంది. అనవసర అంశాల్లో తలదూర్చకండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. విష్ణు ఆరాధన శ్రేయస్కరం.

Taurus - వృషభం: పూర్తిగా మిశ్రమ కాలం నడుస్తోంది. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. కీలక పనులను వాయిదా వేయడం మంచిది. బంధుమిత్రుల సలహాలు మేలైన ఫలితాన్ని ఇస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శివాలయ దర్శనం ఫలితాన్ని ఇస్తుంది.

Gemini - మిథునం: శ్రమ పెరుగుతుంది. అనుకున్నది సాధించే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సాయం అందుతుంది. విందూవినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఇష్టదైవారాధన శుభప్రదం.

Cancer - కర్కాటకం: మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. కానీ శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచింది. గురు ఆరాధన మేలు చేస్తుంది.

Leo - సింహం: మంచికాలం నడుస్తోంది. ఈ సమయాన్ని వినియోగించుకోవాలి. మీ ప్రతిభతో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. తోటివారి సహకారం ఉంటుంది. పెద్దల సలహాలు మేలు చేస్తాయి. ఇష్టదైవ ధ్యానం శుభప్రదం.

Virgo - కన్య: సంతృప్తికరమైన ఫలితాలను అందుకుంటారు. వ్యాపార, ఉద్యోగంలో అనుకూలత ఉంది. కుటుంబంతో కాలక్షేపం చేస్తారు. ముఖ్యమైన విషయాల్లో ఆచితూచి అడుగులేయాలి. మహాలక్ష్మి దర్శనం శుభప్రదం.

Also Read: Viral video: దుబాయ్​ వీధుల్లో పురి విప్పిన నెమలి అందాలు.. వీడియో వైరల్​!

Libra - తుల: భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల గురించి ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. శివారాధన శుభప్రదం.

Scorpio - వృశ్చికం: అవసరానికి తగిన సాయం అందుతుంది. శత్రువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కొన్ని విషయాలలో మీరు అనుకున్న దాని కన్నా ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. సూర్య ఆరాధన మంచి ఫలితాలను ఇస్తుంది.

Sagittarius - ధనుస్సు: ప్రారంభించిన పనులలో ఫలితాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అనవసర విషయాల మీద దృష్టి తగ్గించడం మంచిది. పెద్దల సలహాలు వినండి. ఆదిత్య హృదయం పారాయణ చేస్తే బాగుంటుంది.

Also Read: Pushpa Mania in Cricket: పుష్ప మేనియాతో..తగ్గేదే లే అంటున్న బంగ్లాదేశ్ క్రికెటర్లు

Capricorn - మకరం: ముఖ్య పనులలో ముందుచూపుతో వ్యవహరించాలి. కీలక వ్యవహారాల్లో కుటుంబసభ్యులతో చర్చించాలి. అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయకండి. శివనామస్మరణ ఉత్తమ ఫలితాలను ఇస్తుంది.

Aquarius - కుంభం: శుభకాలం. ఏకాగ్రతతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. ముఖ్య విషయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అవసరం. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి.

Pisces - మీనం: ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. విందూవినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో కలిసిరావొచ్చు. ప్రయాణాలు చేస్తారు. ఇష్టదేవతా శ్లోకాన్ని చదవాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News