Niyati Palat Rajyog 2023: అరుదైన నియతి పాలత్ రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగే ఉండదు! ఇందులో మీరున్నారా

Niyati Palat Rajyog 2023 Will Shine Luck Of These e Zodiac Sign Peoples. హన్స్ మరియు మాలవ్య రాజయోగం వలన ఓ 3 రాశుల వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు.  

Written by - P Sampath Kumar | Last Updated : Feb 28, 2023, 08:53 PM IST
  • అరుదైన నియతి పాలత్ రాజయోగం
  • ఈ రాశుల వారికి ఇక తిరుగే ఉండదు
  • ఇందులో మీరున్నారా
Niyati Palat Rajyog 2023: అరుదైన నియతి పాలత్ రాజయోగం.. ఈ రాశుల వారికి ఇక తిరుగే ఉండదు! ఇందులో మీరున్నారా

These 3 Zodiac Signs will get Sudden Profit due to Niyati Palat Yog 2023: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం... ఒక గ్రహం సంచరించినప్పుడల్లా దాని ప్రభావం అన్ని రాశుల వారి జీవితాలపై స్పష్టంగా ప్రభావం కనిపిస్తుంది. ఒక గ్రహం ఉత్కృష్ట స్థితిలో ఉంటే.. దాని సానుకూల ఫలితాలు ఆ వ్యక్తి జీవితంలో చూడవచ్చు. 2023 జనవరి 17న శని తన రాశిని మార్చింది. ఇక బృహస్పతి తన సొంత రాశి అయిన మీన రాశిలో సంచరించబోతున్నాడు. ఫిబ్రవరి ప్రారంభంలోనే శుక్ర గ్రహం కూడా తన మీన రాశిలోకి ప్రవేశించింది. 

అదే సమయంలో కుజుడు తన మిత్రుడైన శుక్రుడి రాశి వృషభ రాశిని సందర్శించబోతున్నాడు. దాంతో హన్స్ మరియు మాలవ్య రాజయోగాన్ని సృష్టిస్తుంది. అదే సమయంలో ఈ రాజయోగాలలో ఒకటి కూడా ఏర్పడుతోంది. ఈ రాజయోగం అన్ని రాశిచక్ర గుర్తులకు చెందిన వ్యక్తుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే ఓ 3 రాశుల వారు ఆకస్మిక ధనలాభం పొందుతారు. అంతేకాదు కెరీర్లో పురోగతి అవకాశాలు పెరుగుతాయి.

కర్కాటక రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కర్కాటక రాశి వారికి హన్స్ మరియు మాళవ్య రాజయోగంతో మంచి రోజులు మొదలవుతాయి. ఈ సమయంలో వాహనం మరియు ఆస్తి మొదలైనవి ఇంటికి వచ్చే అవకాశం ఉంది. ఈ కాలంలో భౌతిక సుఖాలు లభిస్తాయి. పూర్వీకుల ఆస్తులు పొందే అవకాశాలు ఉన్నాయి. బృహస్పతి ప్రభావం వల్ల ధార్మిక, శుభ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఈ సమయంలో స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీ మొదలైన వాటిలో ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయి.

వృశ్చిక రాశి:
ఈ రాజయోగం వృశ్చిక రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. సంతానం, పురోగతి, ప్రేమ వివాహం మరియు సంపద మొదలైనవి మీ చెంతకు రావొచ్చు. ఈ సమయంలో ప్రేమ వ్యవహారాలలో విజయం ఉంటుంది. పిల్లల నుంచి కొన్ని శుభవార్తలు అందుతాయి. ఉన్నత విద్యాసంస్థల్లో అడ్మిషన్ తీసుకోవాలనే ఆసక్తి ఉన్న విద్యార్థులు విజయం సాధించవచ్చు. ఆకస్మిక ధనలాభం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి.

మిధున రాశి: 
మిధున రాశి వారికి హన్స్ మరియు మాళవ్య రాజయోగం వృత్తి మరియు వ్యాపార పరంగా బాగుంటుంది. శని దేవుడు కూడా ఈ కాలంలో మీ అదృష్టాన్ని ప్రకాశవంతం చేయగలడు. దాంతో ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపార ప్రణాళికలలో లాభాలను పొందవచ్చు. గురు-శుక్రుల ప్రభావంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వృత్తిలో ఉన్నవారికి పదోన్నతి లభిస్తుంది. ప్రభుత్వంలో పనిచేసే వారికి విశేష ప్రయోజనాలు కలుగుతాయి.

Also Read: High Mileage SUVs: అత్యధిక మైలేజీనిచ్చే 6 ఎస్‌యూవీలు.. లీటర్ పెట్రోల్‌పై 28 కిలోమీటర్లు!  

Also Read: మార్చి 13 నుంచి మే 10 వరకు.. ఈ రాశి వారు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి! లేదంటే అంతే సంగతులు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. 

Trending News