Name Astrology: ఈ 3 అక్షరాల పేర్లు ఉన్నవారి జీవితంలో డబ్బుకు కొరతే ఉండదట..!

Name Astrology: నేమ్ ఆస్ట్రాలజీ కూడా జోతిష్యశాస్త్రం మాదిరి ఒక వ్యక్తి జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మీ పేరులోని మొదటి అక్షరం మీ జీవితంపై ప్రభావం చూపుతుంది. ఈరోజు పేరుజోతిష్యం ప్రకారం ఓ మూడు అక్షరాల జీవితంలో డబ్బుకు కొరతే ఉండదట, వారి జీవితంలో ఎప్పుడూ ఆనందం శ్రేయస్సు ఉంటుందట.

Written by - Renuka Godugu | Last Updated : Jan 31, 2024, 02:29 PM IST
Name Astrology: ఈ 3 అక్షరాల పేర్లు ఉన్నవారి జీవితంలో డబ్బుకు కొరతే ఉండదట..!

Name Astrology: జ్యోతిషశాస్త్రంలో పేర్లు జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. పేరు పుట్టినసమయంలో తిథి, ఘడియలు, నక్షత్రాలను బట్టి పెడతారు. ఓ ౩ పేర్లున్న వ్యక్తులు ఆర్థికంగా బలంగా ఉంటారు.  వారికి జీవితంలో డబ్బుకు కొరతే ఉండదట. వీరు జీవితంలో కష్టపడి పనిచేస్తారు. అందుకే వీరికి ఊహించని ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయని జోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇందులో మీ పేరు కూడా ఉందా? ఓసారి చెక్ చేయండి..

A అక్షరం..
A అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు విజయం సాధించడానికి కష్టపడి పని చేస్తారు. వారి కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. అంతేకాదు, A అక్షరంతో పేరు ఉన్న వ్యక్తులు ఆర్థికంగా కూడా ఎంతో అదృష్టవంతులు. పేరు జోతిష్యం ప్రకారం ఈ అక్షరంతో పేరు ప్రారంభమైన వ్యక్తులు మంచి స్వభావం ఉన్న వ్యక్తులు. నిజాయితీపరులు కాబట్టి ఎంతో కష్టపడి పనిచేస్తారు. అందుకే వీరి జీవితంలో అప్పుడప్పుడు ఊహించని ఆర్థిక లాభాలు వస్తాయని జోతిష్యులు చెబుతున్నారు.

R అక్షరం..
ఆంగ్ల అక్షరం R పేరుతో మొదలయ్యే వ్యక్తులు మేధో సంపన్నులు, కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారు. అందుకే వారికి అదృష్టం పూర్తి మద్దతు లభిస్తుంది. ఈ పేరుతో పేరు ప్రారంభమైన వారు జీవితంలో వారి కష్టానికి తగిన డబ్బును కూడా సంపాదిస్తారు. అందుకే జీవితంలో వీరికి డబ్బుకు లోటు ఉండదని జోతిష్యులు చెబుతున్నారు.

S అక్షరం...
పేరు జోతిష్యం ప్రకారం S అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు విజయం సాధించడానికి ముందు అనేక సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఆ సవాలును ధైర్యంగా ఎదుర్కొంటారు. సాధారణంగా ఈ అక్షరంతో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా తెలివైనవారు. కష్టపడి పనిచేయడానికి వెనుకాడరు. అందుకే వారు తమ కష్టానికి తగిన ఫలాన్ని జీవితంలో ఖచ్చితంగా పొందుతారు.

V అక్షరం..
నేమ్ ఆస్ట్రాలజీ ప్రకారం V అక్షరంతో పేరు మొదలయ్యే వ్యక్తులు లక్ష్యాన్ని సాధించడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు. వీళ్లు చాలా తెలివైనవారు అందుకే వీరికి డబ్బుకు లోటు ఉండదు. అనుకున్నవన్ని త్వరగా సాధిస్తారు. ఏదైనా సాధించాలనుకుంటే ఆ పని పూర్తయ్యే వరకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అందుకే పేరు జోతిష్యం ప్రకారం ఈ అక్షరాలతో పేరున్నవారు ఆర్థికంగా బలంగా కూడా అంటారు.(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ఇదీ చదవండి:  Tortoise Ring Benefits: తాబేలు ఉంగరం ఈ వేలికి పెట్టుకుంటే ఎవ్వరైనా ధనవంతులవుతారట..

ఇదీ చదవండి: Dream Meaning: మీకు కలలో నల్లకుక్క కరిచిందా? అయితే, ఏం జరుగుతుందో తెలుసా?

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News