Surya Transit 2022: డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి సూర్య సంచారం.. వీరికి ఊహించనంత ధనం

Surya Transit In Dhanu Rashi: వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, సూర్యదేవుడు  తన మిత్రుడి రాశి అయిన ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. సూర్య భగవానుని ఈ సంచారం 3 రాశుల వారికి శుభప్రదంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 04:38 PM IST
  • ధనస్సు రాశిలోకి సూర్యుడి ప్రవేశం
  • కొత్త సంవత్సరంలో ఈరాశులకు డబ్బే డబ్బు
  • ఇందులో మీరున్నారేమో చెక్ చేసుకోండి
Surya Transit 2022: డిసెంబర్ 16న ధనస్సు రాశిలోకి సూర్య సంచారం.. వీరికి ఊహించనంత ధనం

Surya Transit In Sagittarius 2022: ఆస్ట్రాలజీలో సూర్య భగవానుడు గ్రహాలకు రాజుగా భావిస్తారు. సూర్యుడి సంచారం ప్రజలందరిపై కనిపిస్తుంది. ప్రస్తుతం వృశ్చిక రాశిలో సంచరిస్తున్న సూర్యదేవుడు వచ్చే నెల 16వ తేదీన ధనస్సు రాశిలోకి (Surya Transit In Sagittarius 2022) ప్రవేశించబోతుంది. ఈ రాశి యెుక్క అధిపతి గురుడు. పైగా సూర్యుడు, బృహస్పతి ఇద్దరూ మిత్రులు. ధనుస్సు రాశిలో గురుడి సంచారం వల్ల మూడు రాశులవారు వృత్తిలో పురోగతి, వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 

మేషం (Aries): సూర్య సంచారం ఈ రాశి యెుక్క తొమ్మిదో ఇంట్లో జరగబోతుంది. దీంతో మీకు అదృష్టం కలిసి వస్తుంది. విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మీ ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగులు లాభపడతారు. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 

మీనం (Pisces): సూర్య భగవానుడి రాశి మార్పు మీకు లాభదాయకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంచారం మీ రాశి నుండి పదవ ఇంట్లో జరగబోతోంది. దీంతో నిరుద్యోగులకు జాబ్ ఆఫర్లు రావచ్చు. ఉద్యోగులు కొత్త బాధ్యతలు తీసుకుంటారు. వ్యాపారంలో రెట్టింపు లాభాలు వస్తాయి. మీరు మణి రాయిని ధరించడం వల్ల మీ అదృష్టం ప్రకాశిస్తుంది. 

కుంభం (Aquarius): సూర్యభగవానుని సంచారం కుంభ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే సూర్య దేవుడు మీ సంచార జాతకంలో 11వ ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారుల అద్భుత ప్రయోజనాలు లభించే అవకాశం ఉంది.  మీరు స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో పెట్టుబడి పెట్టాలనుకుంటే ఇదే మంచి సమయం.

Also Read: Shani Dev: శని దేవుడికి చాలా ఇష్టమైన రాశులు ఇవే.. ఈ రాశువారికి జీవితాంతం డబ్బే..డబ్బు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News