surya grahan 2022 time: ఇవాళే సూర్యగ్రహణం, ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, హైదరాబాద్ లో గ్రహణ సమయం ఎంత?

surya grahan 2022 time: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఇవాళే ఏర్పడనుంది. ఈ గ్రహణం ఏ రాశివారిపై ఎలాంటి ప్రభావం చూపనుందో తెలుసుకుందాం. 

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 25, 2022, 08:49 AM IST
surya grahan 2022 time: ఇవాళే సూర్యగ్రహణం, ఏ రాశిపై ఎలాంటి ప్రభావం, హైదరాబాద్ లో గ్రహణ సమయం ఎంత?

surya grahan 2022 time: ఇవాళ అంటే అక్టోబరు 25, మంగళవారం ఆశ్వయుజ మాసం బహుళపక్ష అమావాస్య స్వాతి నక్షత్రంలో సూర్యగ్రహణం ఏర్పడనుంది. ఈ ఏడాది ఇదే చివరి సూర్యగ్రహణం (Solar eclipse 2022). ఈరోజు ఏర్పడబోయే సూర్యగ్రహణం పాక్షికమైనది. ఇది మంగళవారం సాయంత్రం 5.01 గంటలకు ప్రారంభమై 6.26గంటల వరకు ఉంటుంది. గ్రహణ మధ్య కాలం సాయంత్రం 5.29 గంటలగా.. గ్రహణ పుణ్యకాలం 1.25గంటలుగా ఉండనుంది. ఈ పాక్షిక సూర్యగ్రహణం స్వాతినక్షత్రం నందు ఏర్పడుతుండటం వల్ల తులరాశి వారు చూడకుండా ఉంటేనే మంచిది. ఈ గ్రహణం కొన్ని రాశులవారికి శుభప్రదంగానూ, మరికొన్ని రాశులవారికి అశుభకరంగానూ ఉంటుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.

ఈ సూర్యగ్రహణం వృషభ, సింహ, ధనుస్సు, మకర రాశుల వారికి మంచి ఫలితాలను ఇస్తే.. మేషం, కుంభం, మిథునం, కన్య రాశుల వారికి మధ్యస్త ఫలితాలను.. మీన, వృశ్చిక, కర్కాటక, తుల రాశులవారికి అశుభ ఫలితాలను ఇస్తుంది.  ఈ గ్రహణ సమయంలో తలస్నానం చేసి సూర్యభగవానుడిని ఆరాధించడం మంచిది. రాహు జపం, దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల కూడా మీకు మేలు జరుగుతుంది. అదే విధంగా గ్రహణ సమంయలో చేసే ధ్యానానికి విశేష ఫలితాలు లభిస్తాయి. ఒక వేళ దీపావళి పండుగను జరుపుకునేవారు గ్రహణం ముగిశాక అంటే రాత్రి 7 గంటల నుంచి చేసుకుంటే మంచిది.

దేశంలోని ప్రధాన నగరాల్లో గ్రహణ సమయం: 
న్యూఢిల్లీ: 04:28PM నుండి 05:42PM వరకు
ముంబై: 04:49PM నుండి 06:09PM వరకు
కోల్‌కతా: 04:51PM నుండి 05:04PM వరకు
భోపాల్: 04:42PM నుండి 05:47PM వరకు
చండీగఢ్: 04:23PM నుండి 05:41PM వరకు
హైదరాబాద్: 04:58PM నుండి 05:48PM వరకు
బెంగళూరు: 05:12 నుండి 05:56PM వరకు
చెన్నై: 05:13PM నుండి 05:45PM. 

Also Read: Magh Amavasya 2023: మాఘ అమావాస్య ఎప్పుడు, శుభముహూర్తం, పూజ విధానం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News