Surya Gochar 2023 in Tula Rashi: ఆస్ట్రాలజీలో సూర్యుడిని గ్రహాల రాజుగా పిలుస్తారు. సాధారణంగా సూర్యభగవానుడు నెలకొకసారి తన రాశిని మారుస్తాడు. ఎవరి జాతకంలో సూర్యుడు మంచి స్థానంలో ఉంటాడో వారికి దేనికీ లోటు ఉండదు. సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. రీసెంట్ గా భాస్కరుడు కన్యారాశిని విడిచిపెట్టి తులరాశిలోకి ప్రవేశించాడు. దీనినే తుల సంక్రాంతి అంటారు. ఇదే సమయంలో సూర్యుడు అక్టోబర్ 24న స్వాతి నక్షత్రంలోకి, నవంబర్ 7న విశాఖ నక్షత్రంలోకి ప్రవేశిస్తుంది. దీని తర్వాత ఆదిత్యుడు నవంబర్ 17న వృశ్చికరాశిలోకి ప్రవేశిస్తుంది. సూర్యుడి రాశి మార్పు వల్ల 5 రాశులవారు మంచి ప్రయోజనాలను పొందుతారు.
సూర్య సంచారం 5 రాశుల వారికి లాభం
రాశిచక్రం మార్చిన తర్వాత సూర్యుడు ధనుస్సు యొక్క ఆదాయ గృహం, మకరం యొక్క వృత్తి గృహం, కుంభం యొక్క అదృష్ట గృహం, కన్య మరియు తులాల డబ్బు గృహంలో సంచరిస్తాడు. ఈ గృహాలలో సూర్యుని ఉనికి కారణంగా ఈ రాశులవారి కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. ఉద్యోగం సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. జాబ్ చేసేవారికి జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కూడా లభించే అవకాశం ఉంది. మొత్తం మీద సూర్య రాశి మార్పు కన్యా, తుల, ధనుస్సు, మకరం మరియు కుంభ రాశుల వారికి మంచి ప్రయోజనాలను ఇవ్వనుంది.
Also Read: Saturn transit: 2025 వరకు ఈ 3 రాశుల బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంటుంది.. ఇందులో మీది ఉందా?
స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook