Surya Dev: సూర్య దేవుడి అనుగ్రహంతో మకర సంక్రాంతి నుంచి ఈ 4 రాశుల వారి లాభాలే లాభాలు..

Surya Dev Effects On Zodiac Signs: సూర్య గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి మకర సంక్రాంతి నుంచి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా ఉద్యోగాల్లో ప్రమోషన్స్ లభించి..మంచి పేరు సంపాదిస్తారు. ఈ సంచారంతో ఏయే రాశుల వారి జీవితాల్లో మార్పులు వస్తాయో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2024, 10:57 AM IST
Surya Dev: సూర్య దేవుడి అనుగ్రహంతో మకర సంక్రాంతి నుంచి ఈ 4 రాశుల వారి లాభాలే లాభాలు..

 

Surya Dev Effects On Zodiac Signs: జనవరి 15వ తేదీన సూర్య గ్రహం మకర రాశిలోకి సంచారం చేయబోతోంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది అంతేకాకుండా ఎంతో శుభప్రదమైన సంచారంగా భావిస్తారు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఈ సంచారం రోజే మకర సంక్రాంతిని జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 15వ తేదీన వచ్చింది. ఈ సూర్య గ్రహ సంచారంతో కొన్ని రాశుల వారికి అదృష్టం రెట్టింపు కాబోతోంది. అంతేకాకుండా ఈ సంక్రాంతి రోజు నుంచి కొన్ని రాశుల వారు విపరీతమైన ఆర్థిక లాభాలు పొందబోతున్నారు. అయితే ఈ సమయంలో ఏయే రాశుల వారు ఎలాంటి ఫలితాలు పొందుతారో ఇప్పుడు తెలుసుకుందాం.

మకర సంక్రాంతి నుంచి ఈ రాశుల వారికి ధన లాభాలు:
మేష రాశి:

సూర్య గ్రహ సంచారంతో మేష రాశి వారు మకర సంక్రాంతి నుంచి అనేక రకాల ఆర్థిక లాభాలు పొందుతారు. కుటుంబ సభ్యుల సపోర్టు లభించి అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ సమయంలో కళ, సంగీతం పట్ల ఆసక్తి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కూడా ఆనందంగా ఉంటారు. ఆదాయం పెరిగి ఖర్చులు కూడా తగ్గుతాయి. దీని కారణంగా పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి పిల్లల నుంచి అనేక శుభవార్తలు వింటారు.

మిథున రాశి:
సూర్యుడి సంచారం మిథున రాశి వారికి కూడా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా డబ్బు సంపాదించుకోవడానికి మంచి అవకాశాలు కూడా పొందుతారు. దాంపత్య జీవితంలో అనేక మార్పులు వచ్చి, జీవిత భాగస్వామి పై ప్రేమ రెట్టింపు అవుతుంది. ఆదాయం పెరగడం వల్ల కుటుంబంలో గౌరవం ప్రతిష్ట రెట్టింపు అవుతుంది. ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

కన్యా రాశి:
ఈ సమయంలో కన్యా రాశి వారికి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. అంతేకాకుండా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. చేసే పనుల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగాలు చేసే వారికి అధికారుల మద్దతు లభించి జీతాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కూడబెట్టిన సంపాదన కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా స్నేహితుల సపోర్టు లభించి ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు.

ధనస్సు రాశి:
సూర్య గ్రహ సంచారంట ధనస్సు రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అంతేకాకుండా డబ్బు సంపాదించేందుకు కొత్త ఆదాయ వనరులు లభిస్తాయి. వైవాహిక జీవితంలో కూడా అనేక మార్పులు వస్తాయి. ఆదాయం పెరగడం కారణంగా ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెడతారు. ఉద్యోగాలు చేసే వారికి మంచి పేరు లభిస్తుంది.

Also read: Ram Mandir: అయోధ్య వెళ్లేవారు తప్పకుండా సందర్శించాల్సిన పర్యాటక ప్రదేశాలు..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News