Sunday Remedies: సూర్యుడి అనుగ్రహం పొందాలంటే.. ఆదివారం ఈ 5 వస్తువులను దానం చేయండి!

Sunday Remedies: ఆదివారం సూర్యుని పూజించటంతోపాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్న దోషాలను పోయి... మీ ఇంట ధనవర్షం కురుస్తుంది.    

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 10, 2022, 02:40 PM IST
Sunday Remedies: సూర్యుడి అనుగ్రహం పొందాలంటే.. ఆదివారం ఈ 5 వస్తువులను దానం చేయండి!

Sunday Remedies: మనకు ప్రత్యక్షంగా కనిపించే ఏకైక దేవుడు సూర్యభగవానుడు. ఆదివారం సూర్యుడిని పూజిస్తారు. జాతకంలో సూర్యుడు (Surya dev) బలంగా ఉంటే మీ కీర్తి, పురోగతి పెరుగుతుంది. ఆదివారం సూర్యుడిని ఆరాధించటంతోపాటు కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల మీ జీవితం ఆనందంగా ఉండటంతోపాటు అపారమైన డబ్బు లభిస్తుంది. మీ జాతకంలో సూర్యుడు బలపడాలన్నా, గ్రహదోషాలు తొలగిపోవాలన్నా ఆదివారం ఈ పరిహారాలు చేయండి. 

ఈ పరిహారాలు చేయండి
>> ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి సాధించాలంటే.. ఆదివారం నాడు సూర్యునికి సంబంధించిన బెల్లం, రాగి, ఎర్రచందనం, గోధుమలు మరియు పప్పులను అవసరమైన వారికి దానం చేయండి. ఈ పరిహారం చేయడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండటంతోపాటు అంతులేని సంపద మీ సొంతం అవుతుంది.  
>> జ్యోతిష్యం ప్రకారం, ఆదివారం నాడు రాగి ముక్కను రెండు భాగాలుగా చేయండి. ఒక ముక్కను మీ దగ్గరే పెట్టుకోండి. మరొక ముక్కను పారే నదిలో విసిరేయండి. ఇలా చేయడం వల్ల మీకు ప్రభుత్వం ఉద్యోగం రావచ్చు.
>> ఆదివారం నాడు ఎర్రచందనం తిలకం పూయడం వల్ల సూర్యభగవానుడి ఆశీర్వాదం మరియు చెడిపోయిన పనులు జరుగుతాయి.
>> మీ జాతకంలో సూర్య గ్రహాన్ని బలోపేతం చేయడానికి ఆదివారం ఆవుకు రోటీని తినిపించండి. చేపలకు పిండి ముద్దులు పెట్టండి మరియు చీమలకు చక్కెరను వేయండి. 
>> సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి  ప్రతిరోజూ  ''ఓం హరం హరిం హ్రౌం సహ సూర్యాయ నమః'' అనే మంత్రాన్ని జపించండి. అది వీలుకాకపోతే ఆదివారం సూర్యునికి అర్ఘ్యం సమర్పించేటప్పుడు ఈ మంత్రాన్ని జపించండి. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల అన్ని రకాల వ్యాధుల నుండి విముక్తి లభిస్తుంది.

Also Read: Som Pradosh Vrat 2022 : రేపే సోమ ప్రదోష వ్రతం.. శుభ సమయం, పూజా విధానం, ప్రాముఖ్యత

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G  

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News