Kanya Sankranti 2022: కన్యా సంక్రాంతి రోజున ఈ చిన్న పని చేస్తే చాలు... మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది!

Kanya Sankranti 2022: ఇవాళే కన్యాసంక్రాంతి. ఈ రోజున కొన్ని పనులు చేయడం ద్వారా సూర్యభగవానుడి అనుగ్రహం పొందవచ్చు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Sep 17, 2022, 03:51 PM IST
Kanya Sankranti 2022: కన్యా సంక్రాంతి రోజున ఈ చిన్న పని చేస్తే చాలు... మీ లైఫ్ బిందాస్ గా ఉంటుంది!

Kanya Sankranti 2022: ప్రతి గ్రహం నిర్ణీత సమయం తర్వాత ఒక రాశి నుండి మరొక రాశికి బదిలీ అవుతుంది. ఇవాళ అంటే సెప్టెంబర్ 17, 2022 శనివారం నాడు సూర్యభగవానుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. దీనినే కన్యా సంక్రాంతి అంటారు. గ్రంధాల ప్రకారం, సూర్య భగవానుడు అన్ని గ్రహాలకు రాజు. కాబట్టి ఈ రాశి మార్పు ప్రభావం అన్ని రాశులపైనా ఉంటుంది.

కన్యా సంక్రాంతి రోజున సూర్యభగవానుని ప్రసన్నం చేసుకోవడం ద్వారా జీవితం సుఖసంతోషాలతో నిండిపోతుంది. అంతేకాకుండా అన్ని రకాలు దుఃఖాలు, బాధలు తొలగిపోతాయి. పితృ పక్ష సమయంలో కన్యా సంక్రాంతి రావడంతో దీని ప్రాధాన్యత మరింత పెరిగింది. కన్యాసంక్రాంతి (Kanya Sankranti 2022) రోజున నదీస్నానం చేసి దానధర్మాలు చేయడం ఆనవాయితీ. ఈ రోజున ఏ పనులు చేయడం శుభప్రదంగా భావిస్తారో తెలుసుకుందాం. 

కన్యా సంక్రాంతి రోజున ఈ పని చేయండి
>> ఈ రోజున ప్రజలు పవిత్రమైన చెట్లను మరియు మొక్కలను నాటవచ్చు. ఇది ప్రస్తుతం పితృ పక్షం సమయం అయినందున రావిచెట్టును నాటడం శుభప్రదం. నమ్మకాల ప్రకారం, పీపుల్  చెట్టులో పూర్వీకులు నివసిస్తారు అంటారు. అంతేకాకుండా ఈ రోజున తులసి లేదా బిల్వ మొక్కను కూడా నాటవచ్చు. ఇలా చేయడం వల్ల దేవుడు సంతోషిస్తాడు.
>> సంక్రాంతి రోజున మీ శక్తికి తగినట్లు బట్టలు, ఆహారం, బూట్లు, చెప్పులు, మందులు మొదలైన వాటిని అవసరమైన వారికి దానం చేయండి. వీలైతే గోశాలకు కూడా డబ్బు లేదా ఆహార ధాన్యాలు దానం చేయండి.
>> కన్యా సంక్రాంతి రోజున ఉదయం లేచి స్నానం చేసి..రాగిపాత్రలో నీరును తీసుకుని సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించండి. అర్ఘ్యం సమర్పిస్తున్నప్పుడు ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఉండండి.

Also Read: Vishwakarma Puja 2022: ఇవాళే విశ్వకర్మ జయంతి.. ఈ శుభముహూర్తంలో విశ్వకర్మను పూజించండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News