Sun Transit 2022 Effect: సూర్య సంచార ప్రభావం... కూల్ మైండ్‌తో పని చేయకపోతే ఈ రాశివారికి నష్టం!

Sun Transit Taurus:  గ్రహాలు రాశిచక్రాన్ని మార్చినప్పుడల్లా దాని ప్రభావం మెుత్తం 12 రాశులపై ఉంటుంది. 11 నెలల తర్వాత సూర్యభగవానుడు తన సొంత రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని ప్రభావం వృషభరాశిపై ఎలా ఉండనుందో తెలుసుకుందాం.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 9, 2022, 03:14 PM IST
Sun Transit 2022 Effect: సూర్య సంచార ప్రభావం... కూల్ మైండ్‌తో పని చేయకపోతే ఈ రాశివారికి నష్టం!

Sun Transit Taurus: సూర్యభగవానుడిని గ్రహాల రాజు అంటారు. సూర్యుడు రాశి మారడాన్నే సంక్రాంతి అంటారు. అయితే సూర్యనారాయణుడు 11 నెలల తర్వాత తన సొంత రాశిలోకి ప్రవేశించనున్నాడు. ఆయన ఆగస్టు 17న సింహారాశిలోకి (Sun Transit in leo 2022)ప్రవేశించనున్నాడు. ఇప్పటికే ఆ రాశిలో శుక్రుడు ఉన్నాడు. దీని ప్రభావం మెుత్తం 12 రాశి చక్రాలపై శుభం లేదా అశుభంగా ఉంటుంది. ముఖ్యంగా దీని ఎఫెక్ట్ వృషభరాశిపై ఎక్కువగా ఉండనుంది. 

వృషభరాశిపై సూర్య సంచార ప్రభావం
వృషభ రాశి వారు మానసికంగా అయోమయ స్థితిలో ఉంటారు.  కాబట్టి ఈ కాలంలో వీరు చాలా కూల్ మైండ్ తో పనిచేయాలి. ఎవరిపై కోప్పడకుండా నిదానంగా సమస్యను పరిష్కరించుకోవడానికి ప్రయత్నించాలి. అంతేకాకుండా ఈ సమయంలో ఈ రాశి వారు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులు క్రమం తప్పకుండా మందులు తీసుకోవాలి. ఇంట్లో వివాదాలు చెలరేగితే ఓపికతో పరిష్కరించడానికి ప్రయత్నించండి.  మీ భార్యను సంతోషంగా ఉంచండి. 

మీరు ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే రిజర్వేషన్ చేసుకోవడం వెళ్లడం మంచిది. లేకపోతే జర్నీలో మీరు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవల్సి వస్తుంది. కొంతమంది మిమ్మిల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేయవచ్చు. మీ పరువు కుడా పోయే అవకాశం ఉంది. అలాంటప్పడు సంయమనంతో వ్యవహారించండి. 

Also Read: Mangala Gowri Vratham 2022: శ్రావణ సోమవారానికే కాదు.. మంగళవారానికీ ఓ ప్రత్యేకత ఉంది! అదేంటో.. తెలుసా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News