Sun transit August 2023: సింహరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. అదృష్టమంటే ఈ మూడు రాశులిదే..!

Surya Gochar 2023: హిందూ పంచాంగం ప్రకారం, సూర్యుడి రాశి మార్పునే సంక్రాంతి అంటారు. ఆస్ట్రాలజీలో ఇతడి రాశి మార్పు చాలా కీలకమైనది. భాస్కరుడు త్వరలోనే సింహరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇది మూడు రాశులవారికి ప్రయోజనకరంగా ఉండనుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jul 27, 2023, 04:49 PM IST
Sun transit August 2023: సింహరాశిలోకి ప్రవేశించబోతున్న సూర్యుడు.. అదృష్టమంటే ఈ మూడు రాశులిదే..!

Sun transit in August 2023: ఆస్ట్రాలజీలో సూర్యభగవానుడిని గ్రహాల రాజు అని పిలుస్తారు. ఇతడు నెలకొకసారి రాశిని మారుస్తాడు. ప్రస్తుతం భాస్కరుడు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 16న సింహరాశిలోకి (Sun transit in leo 2023) ప్రవేశించనున్నాడు. సింహరాశికి అధిపతి కూడా సూర్యుడే. అందుకే అదేరాశిలో సూర్య సంచారం మెుత్తం 12 రాశులవారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. సింహరాశిలోకి ఆదిత్యుడు వెళ్లడం వల్ల వాశి రాజ్యయోగం ఏర్పడుతుంది. ఇది మూడు రాశులవారికి బంపర్ బెనిఫిట్స్ ను అందించనుంది. ఆ అదృష్ట రాశిచక్రాలు ఏవో తెలుసుకుందాం. 

వృశ్చికం: సూర్యుడి కదలిక వృశ్చిక రాశివారికి అపారమైన ప్రయోజనాలను ఇవ్వనుంది. మీరు కెరీర్ లో ఉన్నత స్థాయికి ఎదుగుతారు. పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుంది. మీ లైఫ్ లో సంతోషం పెరుగుతుంది. మీ ఆదాయ వనరులు పెరుగుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీరు ఆర్థికంగా బలపడతారు. 

ధనుస్సు : వాశి రాజయోగం ధనుస్సు రాశి వారికి చాలా మేలు చేస్తుంది. మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. విదేశాల్లో చదవాలనే మీ కోరిక నెరవేరుతుంది.  మీ బిజినెస్ పెరుగుతుంది. మీరు ఏదైనా యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఉద్యోగులు మరియు వ్యాపారులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

సింహం : ఇదే రాశిలో సూర్యుడి సంచారం జరగడం వల్ల వాశి రాజయోగం ఏర్పడుతుంది. దీని వల్ల మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది. బిజినెస్ చేసేవారు భారీగా లాభపడతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. 

Also read: Venus set 2023: ఆగస్టు 3న అస్తమించబోతున్న శుక్రుడు.. ఈ 3 రాశులకు కష్టాలు షురూ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News