Sun Transit 2022: వచ్చే నెల 16న ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు!

Sun Transit will Enter Sagittarius on 2022 December 16: డిసెంబర్ 16న ధనుస్సు రాశిలోకి సూర్యుడు ప్రవేశించబోతున్నాడు. సూర్యుని ప్రవేశం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 1, 2022, 09:06 PM IST
  • డిసెంబర్‌లో సూర్యుని సంచారం
  • 18 రోజులు ఆగితే చాలు
  • ఈ రాశుల వారికి వద్దన్నా డబ్బు జేబులోకి వస్తుంది
Sun Transit 2022: వచ్చే నెల 16న ధనుస్సు రాశిలోకి ప్రవేశించనున్న సూర్యుడు.. ఈ 5 రాశుల వారికి డబ్బే డబ్బు!

Sun Transit in Sagittarius on 2022 December 16: వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం... గ్రహాల రారాజు అయిన సూర్యుడు త్వరలో సంచరించబోతున్నాడు. డిసెంబర్ 16న వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ధనుస్సు రాశిలోకి సూర్యుని ప్రవేశం అన్ని శుభకార్యాలను నిషేధిస్తుంది. మకర సంక్రాంతి 2023 వరకు వివాహాలు, గృహ ప్రవేశం, నూతన పనులు లాంటివి చేయకూడదు. అయితే ధనుస్సు రాశిలోకి సూర్యుని ప్రవేశం కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. డిసెంబర్‌లో సూర్యుని సంచారంతో ఏ రాశుల వారికి మంచి రోజులు ప్రారంభమవుతాయో ఓ సారి తెలుసుకుందాం.

మేషం:
సూర్య సంచారం మేష రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా విద్యార్థులకు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి లేదా విదేశాల్లో చదువుకోవాలనుకునే వారి కోరిక నెరవేరుతుంది. ఉద్యోగ, వ్యాపార పరంగా ఈ సమయం బాగుంటుంది. ప్రతి పనిలో విజయం సాధిస్తారు.

కర్కాటకం:
సూర్యుని మార్పు కర్కాటక రాశికి శుభప్రదంగా ఉంటుంది. పరీక్ష, పోటీ పరీక్ష లేదా ఇంటర్వ్యూలో విజయాలు సాధిస్తారు. ఈ సమయంలో కర్కాటక రాశి వారికి శుభవార్తలు అందుతాయి. పాత విషయాలు పరిష్కారమవుతాయి. ఆర్థిక ప్రయోజనం బాగుంటుంది. 

కన్య:
డిసెంబర్ నెలలో సూర్యుని సంచారం కన్య రాశి వ్యాపారులకు పెద్ద లాభాలను ఇస్తుంది. ఉద్యోగం చేస్తున్న వారికి పదోన్నతులు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ సమయంలో కన్య రాశి వారి ఆదాయం పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మధ్య సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.

వృశ్చికం:
సూర్యుని రాశి మార్పు శుభ ప్రభావం వృశ్చిక రాశి వారిపై ఉంటుంది. సూర్యుడు వృశ్చిక రాశిని వదిలి ధనుస్సు రాశిలోకి ప్రవేషించడం వలన ఈ రాశి వారికి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కోరుకున్న ప్రదేశానికి బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.

ధనుస్సు:
డిసెంబర్ 16న సూర్యుడు ధనుస్సు రాశిలో సంచరిస్తాడు. కాబట్టి ధనుస్సు రాశికి చెందిన వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. ధనుస్సు రాశి వారు తమ కెరీర్‌లో భారీ లాభాలను పొందుతారు. పదవి, ధనం, గౌరవం దక్కుతాయి. ఎప్పుడో ఆగిపోయిన పనులు ఇప్పుడు పూర్తవుతాయి.

Also Read: విడాకులు తీసుకున్న సానియా, షోయబ్.. ఆ ఒక్క కారణంగానే ఆగారు! అధికారిక ప్రకటన ఎప్పుడంటే

Also Read: Weight Loss Tips: రోటీ తింటే బరువు తగ్గుతారా లేదా?.. డైటీషియన్స్ ఏం చెపున్నారంటే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook.

Trending News