Sun Transit 2022: ఈ రాశి వారు తస్మాత్‌ జాగ్రత్త.. వీరికి ఆర్థిక నష్టాలు తప్పవు..

Sun Transit 2022: సూర్యుడు గ్రహం తన సొంత రాశిని వదిలి ఇతర రాశిలోకి ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశి అర్థిక నష్టాలు కలుగుతాయని జోతిష్య శాస్త్రం పేర్కొంది. అంతేకాకుండా వీరి అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయని శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 15, 2022, 10:12 AM IST
  • సూర్యుడ గ్రహ రాశి సంచారం వల్ల
  • వృశ్చిక రాశి అర్థిక నష్టాలు
  • కాబట్టి జాగ్రత్తగా ఉండండి
Sun Transit 2022: ఈ రాశి వారు తస్మాత్‌ జాగ్రత్త.. వీరికి ఆర్థిక నష్టాలు తప్పవు..

Sun Transit 2022: సూర్యుడు గ్రహం రాశి సంచారం వల్ల 12 రాశిచక్రాలపై విభిన్న ప్రభావాలు పడబోతున్నాయి. అయితే అన్ని రకాల గ్రహాలు తమ సొంత రాశులను వదిలి వివిధ రాశులోకి సంచారం చేస్తాయి. అయితే ఇటీవలే సూర్య గ్రహం కూడా ఇంతకముందు ఉండే రాశిని వదిలి తులారాశిలో ప్రవేశించనున్నాడు. దీంతో పలు రకాల రాశులవారిపై తీవ్ర ప్రభావవం పడే అవకాశాలున్నాయి. అంతేకాకుండా దీని ప్రభావవం పలు రాశులపై చెడుగా ఉంటే మరికొన్ని రాశులవారిపై మంచి ప్రభావవం పడబోతోందని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే దాదాపు దీపావళికి వారం రోజుల ముందు అక్టోబర్ 17న సంచారం జరగబోతోంది. దీని వల్ల పలు రాశులపై ఈ ప్రభావవం ఉండబోతోంది.

సూర్య గ్రహం సంచారం వల్ల వృశ్చిక రాశి వారిపై దీని ప్రభావం పడబోతోంది. అయితే ఇలాంటి క్రమంలో వీరు కచ్చితంగా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఆర్థిక పరంగా ఆచితూచి అడుగులు వేయాల్సి ఉంటుంది. అయితే ఈ సంచారం వల్ల ఈ రాశి వారికి ఖర్చులు పెరిగే అవకాశాలున్నాయి. అంతేకాకుండా వివిధ రకాల ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక అంశంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది.

ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించవద్దు:
అయితే ఈ రాశులవారు చిన్న చిన్న విషయాలకు చింతించే అవకాశాలున్నాయి. కాబట్టి వీరు ఇలా చేయడం మానుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా మైగ్రేన్ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి తప్పకుండా ప్రత్యేక జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా రాత్రి సమయాల్లో వీరికి సరిగ్గా నిద్ర పట్టదు. కీళ్లలో నొప్పులు ముఖ్యంగా కళ్ల సమస్యలు వచ్చే ఛాన్స్‌ ఉంది. కాబట్టి ఇలాంటి సమస్యలు ఈ క్రమంలో సహజం. అయితే తప్పకుండా వైద్యులను సంప్రదించడం వల్ల వీటిని నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చు. స్నేహితులు, బంధువులు మీపై కోపంగా ఉండవచ్చు. కాబట్టి ఈ క్రమంలో మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది.

ఈ రాశివారు వ్యాపారాలు చేసే క్రమంలో తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొత్త ఒప్పందాన్ని చేసుకునే ముందు తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఈ క్రమంలో వీరికి నష్టాలు కూడా రావొచ్చు. కాబట్టి తప్పకుండా ఈ సందర్భంగా సూర్యున్ని పూజించాల్సి ఉంటుంది. ఈ సంచారం వల్ల వృశ్చిక రాశి అవమానాలు, ధన నష్టం, స్నేహితులతో వివాదాలు వచ్చే అవకాశాలున్నాయి.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ అంచనాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దానిని నిర్ధారించలేదు.)

Read Also: Happy Birthday Sai Dharam Tej : చావు అంచుల దాకా వెళ్లొచ్చిన మెగాహీరో.. 8 ఏళ్లలో ఎన్ని కోట్లు వెనకేశాడో తెలుసా?

Read Also: White king Cobra: 20 అడుగుల రేర్ వైట్ కింగ్ కోబ్రాని చూసారా..? చూస్తే గూస్ బంప్స్ పక్కా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

Trending News