Sun-Jupiter Transit 2023: 12 ఏళ్ల తరువాత కలవనున్న సూర్య, గురు గ్రహాలు, ఆ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే

Sun-Jupiter Transit 2023: ఆర్ధిక ఇబ్బందులతో బాధపడుతున్నవాళ్లు ఇంకొక్క నెల ఓపిక పడితే జాతకం మారిపోనుంది. ఏప్రిల్ నెల నుంచి ఆ 4 రాశుల జాతకులపై ఊహించని ధనలాభం కలుగుతుంది. దశ తిరిగిపోనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 3, 2023, 07:28 AM IST
Sun-Jupiter Transit 2023: 12 ఏళ్ల తరువాత కలవనున్న సూర్య, గురు గ్రహాలు, ఆ 4 రాశులకు పట్టిందల్లా బంగారమే

హిందూమతంలోని జ్యోతిష్యం ప్రకారం అన్ని గ్రహాలు నియమిత సమయంలో రాశి మారుతుంటాయి. గ్రహాల గోచారమని కూడా పిలుస్తుంటారు. గ్రహాల గోచారంతో చాలా రాశులకు అదృష్టపు మార్గాలు తెర్చుకుంటాయి. ఇంకొంతమందికి మాత్రం బ్యాడ్ డేస్ ప్రారంభమౌతాయి. ఏప్రిల్ నుంచి మాత్రం ఆ నాలుగు రాశుల జాతకాల దశ తిరగనుంది.

మీరు ఇప్పటి వరకూ ఆర్ధిక సమస్యలతో బాధపడుతుంటే..మరో నెల నిరీక్షిస్తే మంచి రోజులు ప్రారంభమౌతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. గురుడి రాశిలో సూర్యుడి కలయిక కారణంగా 4 రాశులకు అదృష్టం మారిపోనుంది. దశ తిరగనుండటంతో ఏప్రిల్ నెల నుంచి ఊహించని ధనలాభం కలుగుతుంది. సూర్యుడు, గురుడు ఒకేరాశిలో కలవడం అనేది జ్యోతిష్యం ప్రకారం చాలా మహత్యం కలిగిందిగా ఉంటుంది. జ్యోతిష్యం ప్రకారం గ్రహాల రాశి పరివర్తనం లేదా గోచారం వల్ల కొన్ని రాశులకు అనుకూలంగా, మరికొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. ఏప్రిల్ నెలలో ముందుగా చెప్పినట్టుగా గ్రహాల రాజు సూర్యుడు, దేవతల గురువు గురుగ్రహం మేషరాశిలో కలవనున్నారు. ఈ అద్భుతమైన యుతి 12 ఏళ్ల తరువాత ఏప్రిల్ 14వ తేదీన జరగనుంది. అంటే ఆ నాలుగు రాశులకు ఏప్రిల్ 14 నుంచి ఇక దశ మారిపోయనట్టే.

సింహ రాశి

సింహరాశి వారికి సూర్య, గురు గ్రహాల కలయిక లేదా యుతి కారణంగా ఊహించని అద్భుత ప్రయోజనం కలగనుంది. ఆరోగ్యం విషయంలో కూడా గతం కంటే చాలా బాగుంటుంది. పనిచేసేచోట ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు, వృద్ధి ఉంటాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. ఇంట్లో అందరితో మంచి సంబంధాలుంటాయి.

మిధున రాశి

ఈ రాశి జాతకులకు ఆర్ధిక పరిస్థితి గతంలో పోలిస్తే చాలా మెరుగుపడుతుంది. కుటుంబ జీవితం చాలా బాగుంటుంది. ఎక్కువ సమయం ఇంట్లోవారితో గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి బాగుండటంతో ఒత్తిడి దూరమౌతుంది. ఏదైనా పెట్టుబడికి ఆలోచిస్తుంటే ఇది చాలా మంచి సమయం. మీరు ఊహించని చోటి నుంచి ఆకస్మిక ధనలాభముంటుంది. 

మీన రాశి

సూర్య, గురు గ్రహాలు ఒకేసారి ఈ రాశిలో కలవడం వల్ల దశ తిరిగిపోనుంది. కెరీర్‌లో మంచి లాభాలు కలుగుతాయి. ఉద్యోగంలో ఇంక్రిమెంట్లతో పాటు పదోన్నతి లభించవచ్చు. ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఊహించని ధనలాభం మీ కష్టాల్ని తీరుస్తుంది. 

మేష రాశి

గ్రహాల గోచారంతో మేష రాశి జాతకులకు ఉద్యోగ, వ్యాపారాల్లో భారీ విజయం లభిస్తుంది. చేపట్టిన పనిలో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ మర్యాదకలు పెరుగుతాయి. కుటుంబంతో కలిసి బయటకు యాత్రకు వెళ్తారు. 

Also read: Planet transit 2023: మార్చ్ నెలలో 4 రాశులకు మారనున్న జాతకం, ఊహించని ధనలాభం, పదోన్నతి, ఉద్యోగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News