Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం, బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Srisailam Brahmotsavalu: మహా శివరాత్రి సమీపిస్తోంది. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 25, 2021, 12:30 AM IST
Srisailam Brahmotsavalu: మహా శివరాత్రికి ముస్తాబవుతున్న శ్రీశైలం క్షేత్రం, బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు

Srisailam Brahmotsavalu: మహా శివరాత్రి సమీపిస్తోంది. శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం ఆలయం ముస్తాబవుతోంది. శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం బ్రహ్మోత్సవాలు ఎప్పటినుంచంటే..

మహా శివరాత్రి ( Maha Shivaratri )అంటేనే గుర్తొచ్చే పుణ్యక్షేత్రం శ్రీశైలం. ఏపీలోని పంచారామ క్షేత్రాలతో పాటు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవాలయం ప్రాముఖ్యత చాలా ఎక్కువగా ఉంటుంది. ప్రతి మహా శివరాత్రి  సందర్బంగా శ్రీశైలం బ్రహ్మోత్సవాలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు మార్చ్ 4వ తేదీ నుంచి మార్చ్ 14 వరకూ 11 రోజుల పాటు శ్రీశైలం బ్రహ్మోత్సవాలు జరగనున్నాయని ఆలయ అధికారులు ప్రకటించారు. ఈ  బ్రహ్మోత్సవాలకు శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయం ( Srisailam temple) ముస్తాబవుతోంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఈ ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని అధికారులు చెప్పారు. ఈ ఉత్సవాల నిర్వహణకు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా బుధవారం ఆలయ పరిసరాల్లో వాహనాల పార్కింగ్ ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు.

యజ్ఞవాటిక వద్ద నిర్మాణంలో ఉన్న గణేశ సదనానికి ఎదురుగా తెలంగాణ, కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులకు పార్కింగ్ ఏర్పాటు చేయడం జరుగుతోందని తెలిపారు. ఇక యజ్ఞవాటిక వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎడమవైపు ప్రదేశం, ఘంటామఠం వెనుకభాగం, దేవస్థానం ఆగమ పాఠశాల ఎదురుగా ఉన్న ప్రాంతాలలో కార్ పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నామని ఆలయ అధికారులు వెల్లడించారు. పార్కింగ్ ప్రదేశాలలో ఇప్పటికే ప్రారంభించిన జంగిల్ క్లియరెన్స్ పనులను వేగవంతం చేశారు. వాహనాలు, బస్సులు పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లే మార్గాల్ని తెలిపే విధంగా ఎక్కడికక్కడ ఫ్లెక్స్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రీశైలం బ్రహ్మోత్సవాల్ని( Srisailam Brahmotsavalu) అత్యంత ఘనంగా నిర్వహించనున్నామని అధికారులు స్పష్టం చేశారు. 

Also read: Today Horoscope: నేటి రాశి ఫలాలు ఫిబ్రవరి 24, 2021 Rasi Phalalu, ఓ రాశివారికి నూతన అవకాశాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News