Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!

Sri Rama Navami 2024: శ్రీరామనవమి రోజున బృహస్పతి గ్రహము నక్షత్ర సంచారం చేయబోతోంది. దీనికి కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో మేషరాశి తో పాటు సింహరాశి ఇతర రాశుల వారు విపరీతమైన ధన లాభాలు కూడా పొందే అవకాశాలు ఉన్నాయి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Apr 16, 2024, 11:21 PM IST
Sri Rama Navami 2024: శ్రీ రామ నవమి రోజే బృహస్పతి నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల వారికి లాభాలే లాభాలు!

 

Sri Rama Navami 2024: హిందూమతంలో ఎంతో ప్రత్యేకమైన పండుగలు శ్రీరామనవమి ఒకటి. ఈ రోజునే శ్రీరాముడు ఏడు అవతారాల్లో జన్మించాడని పురాణాల్లో పేర్కొన్నారు. మత విశ్వాసాల ప్రకారం చైత్రమాసంలోని శుక్లపక్షమి 9వ తిథిన అయోధ్య పట్టణంలోని దశరథ మహారాజుకి మొదటి సంతానమైన సాక్షాత్తు శ్రీరాముడు జన్మించాడు. కాబట్టి ఈ రోజున ఎంతో ప్రాముఖ్యమైన రోజుగా భావించి శ్రీరామనవమి వేడుకలు జరుపుకుంటారు. ఎంతో ప్రాముఖ్యత కలిగిన రోజున శ్రీరాముడితోపాటు సిద్ధిదాత్రి అమ్మవారిని పూజించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం హిందూ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వచ్చింది. ఇదిలా ఉంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బృహస్పతి గ్రహం ఏప్రిల్ 17వ తేదీన రెండు గంటలకు భరణి నక్షత్రం నుంచి కృత్తిక నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. ఇలా బృహస్పతి విగ్రహం సంచారం చేయడం కారణంగా కొన్ని రాశుల వారికి చాలా శుభ్రంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో కొన్ని రాశుల వారికి విపరీతమైన ధన లాభాలతో పాటు అదృష్టం రెట్టింపు అవుతుందట. అయితే బృహస్పతి సంచారం కారణంగా ఏయే రాశుల వారికి శ్రీరామనవమి రోజు ఎలా ఉంటుందో తెలుసుకోండి.

మేష రాశి:
మేష రాశి వారికి బృహస్పతి నక్షత్ర సంసారం చేయడం కారణంగా ఆర్థిక స్థితిగతులు మునుపటికంటే ఇప్పుడు చాలా మెరుగుపడతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీంతో పాటు ఇంట్లో మతపరమైన కార్యక్రమాలు కూడా జరగవచ్చు. అంతేకాకుండా వీరి సంపద కూడా పెరుగుతుంది. అలాగే ప్రతి పనిలో పాజిటివ్ ఎనర్జీతో ముందుకెళ్తారు.

సింహరాశి:
శ్రీరాముడు జన్మించిన రోజున సింహ రాశి వారికి చాలా శుభ్రంగా ఉంటుంది. అంతేకాకుండా వీరికి అదృష్టం పెరగడమే కాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. ముఖ్యంగా వృత్తి జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. దీంతోపాటు ఇంట్లో శుభకార్యాలు జరగడం కారణంగా కుటుంబ సభ్యులతో కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయి.

తులారాశి:
తులా రాశి వారికి కూడా శ్రీరామనవమి ఎంతో శుభప్రదంగా ఉండబోతోంది. ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడమే, కాకుండా సంపాదనలో మార్పులు వచ్చి కొత్త ఆదాయ వనరులు కూడా లభిస్తాయి. పనుల్లో ఆటంకాలు సులభంగా తొలగిపోవడమే కాకుండా పాత పనులు ముందుకు వెళ్తాయి. అలాగే వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు కొత్త భూములు కూడా కొనుగోలు చేయగలుగుతారు.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

వృశ్చిక రాశి:
ఏప్రిల్ 17 నుంచి వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా బృహస్పతి నక్షత్ర సంచారం చేయడం కారణంగా ఈ రాశి వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ముఖ్యంగా వీరు కెరీర్ పరంగా పురోగతి పొందుతారు. ఇంతకుముందు అప్పులు చేసినవారు డబ్బులను తిరిగి చెల్లించే అవకాశాలు కూడా ఉన్నాయి. అలాంటి వ్యాపారాలు చేసే వారికి విపరీతమైన ధన లాభాలు కలుగుతాయి ఇక పిల్లలనుంచి కూడా శుభవార్తలు అందుకుంటారని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

(నోట్: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకం, వాస్తవాలపై ఆధారపడింది. జీ తెలుగు న్యూస్ దీనిని సమర్థించదు.)

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News