Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య 2023.. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!

Do These Remedies on Somvati Amavasya, You Will Get Immense Money. సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు పూజలు చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Feb 20, 2023, 04:38 PM IST
  • సోమవతి అమావాస్య 2023
  • ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం
  • భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం
Somvati Amavasya 2023: సోమవతి అమావాస్య 2023.. ఇలా చేస్తే అఖండ ఐశ్వర్యం మీ సొంతం!

Somvati Amavasya 2023 Remedies: హిందూ క్యాలెండర్ ప్రకారం... 'సోమవతి అమావాస్య'నుం ఫిబ్రవరి 20న జరుపుకుంటారు. హిందూ మతంలో ఈ సోమవతి అమావాస్యకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున పూర్వీకులకు పూజలు చేయడం వల్ల వారి ఆత్మకు శాంతి చేకూరుతుందని, వారి ఆశీస్సులు మనకు లభిస్తాయని చెబుతారు. అంతేకాకుండా వివాహిత మహిళలకు కూడా ఈ రోజు ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేక ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

'సోమవతి అమావాస్య' రోజున వివాహిత స్త్రీలు ఇంట్లోని కుటుంబ సభ్యుల సుఖ సంతోషాలు, శాంతి మరియు శ్రేయస్సు కోరుతూ ఉపవాసం ఉంటారు. అఖండ సౌభాగ్యాలను పొందేందుకు కూడా వివాహిత స్త్రీలు ఉపవాసం చేస్తారు. మహిళలు ఈ రోజున ఉపవాసం చేసి.. రావి చెట్టును పూజించాలి.

సోమవతి అమావాస్య రోజున పూజలు కాకుండా కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకుంటే.. మరింత మేలు జరుగుతుంది. ఈ రోజున వివాహిత స్త్రీలు తమ భర్త దీర్ఘాయుష్షు కోసం ఉపవాసం ఉంటే.. పార్వతీ దేవి అనుగ్రహం పొందుతారు.

సోమవతి అమావాస్య రోజున వివాహిత స్త్రీలు ఉపవాసం ఉండి.. శివుడు మరియు పార్వతికి పూజలు చేస్తే అఖండ సౌభాగ్యాలను లభిస్తాయి. ఆరాధన తర్వాత శివునికి ఆరతి ఇవ్వాలని గుర్తుంచుకోండి.

సోమవతి అమావాస్య రోజున పూర్వీకులకు నైవేద్యం పెడితే.. వారి ఆశీర్వదాలు మనకు లభిస్తాయి. తన పూర్వీకుల ఆశీర్వాదం ఉన్న వ్యక్తి అన్ని పనుల్లో విజయవంతమవుతారు.

సోమవతి అమావాస్య రోజు దానం చేయడం చాలా శుభప్రదం. అందుకే వీలైనంత వరకు అవసరమైన వారికి దానధర్మాలు చేయాలి. మొక్కలు నాటడం కూడా పుణ్యమే. ఈ రోజున రావి, మర్రి, అరటి, నిమ్మ లేదా తులసి చెట్లను నాటండి.

సోమవతి అమావాస్య రోజున శివుడిని పూజిస్తే చంద్రుడు బలపడతాడని ప్రజలు విశ్వసిస్తారు. అంతేకాకుండా శివపార్వతుల ఆరాధన వల్ల వైవాహిక జీవితంలో సంతోషం కలుగుతుంది.

Also Read: Xiaomi 13 Pro: షియోమీ నుంచి సూపర్ లుకింగ్ స్మార్ట్‌ఫోన్‌.. నిమిషాల్లో పూర్తి ఛార్జింగ్! లాంచ్ చేయడానికి ముందే లీకైన ధర

Also Read: Facebook Subscription: ట్విట్టర్ బాటలో మెటా.. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ బ్లూ బ్యాడ్జ్‌కు డబ్బులు వసూలు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News