Solar - Lunar Eclipse dates: 2024లో సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు సంభవించబోతున్నాయో తెలుసా?

Grahanalu 2024: వచ్చే సంవత్సరం రెండు సూర్య, రెండు చంద్రగ్రహణాలు సంభవించబోతున్నాయి. ఈ గ్రహణాలు భారతదేశంలో కనిపిస్తాయా, సూతక్ కాలం చెల్లుతుందో లేదో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Dec 13, 2023, 06:59 PM IST
Solar - Lunar Eclipse dates: 2024లో సూర్య, చంద్రగ్రహణాలు ఎప్పుడు సంభవించబోతున్నాయో తెలుసా?

Solar Eclipse and Lunar Eclipse in 2024 In Telugu: సాధారణంగా మనం గ్రహణాలను అశుభంగా భావిస్తాం. గ్రహణ సమయంలో పూజలు, శుభకార్యాలు చేయడం మానుకుంటాం. సూర్య, చంద్రగ్రహణాలను ఖగోళ సంఘటనలుగా భావిస్తారు. అయితే వీటికి ఆస్ట్రాలజీలో చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే సూర్యగ్రహణం అమావాస్య రోజున, చంద్రగ్రహణం పౌర్ణమి రోజున ఏర్పడతాయి. సూర్యుడుకు, భూమికి మధ్య చంద్రుడు అడ్డుగా వచ్చినప్పుడు సూర్యగ్రహణం... సూర్యుడికి, చంద్రుడికి మధ్య భూమి అడ్డుగా వచ్చినప్పుడు చంద్రగ్రహణం ఏర్పడుతుంది. 

2024లో గ్రహణాల తేదీలు..
వచ్చే ఏడాది తొలి చంద్రగ్రహణం మార్చి 25న ఏర్పడబోతోంది. 2024 సంవత్సరంలో తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 8న సంభవించబోతోంది. మరోవైపు రెండో చంద్రగ్రహణం సెప్టెంబరు 18న, సెకండ్ సూర్యగ్రహణం అక్టోబర్ 02న ఏర్పడనున్నాయ. అయితే ఈసారి చంద్రగ్రహణాలు రెండు భారతదేశంలో కనిపించవు. అంటే సూతక్ కాలం కూడా చెల్లదు. అయితే మెుదటి చంద్రగ్రహణం 4 గంటల 36 నిమిషాలు, రెండో చంద్రగ్రహణం 4 గంటల 04 నిమిషాల పాటు ఉండనున్నాయి. 2024 సంవత్సరంలో ఏర్పడబోయే సూర్యగ్రహణాలు రెండు కూడా ఇండియాలో కనిపంచవు. దీని కారణంగా సూతక్ కాలం చెల్లదు. 

Also read: Astrological Prediction: 2024లో ఈ 4 రాశుల వారి కెరీర్ అద్భుతంగా ఉండబోతోంది.. ఇందులో మీ రాశి ఉందా?

గ్రహణ సమయంలో గుడిని మూసి ఉంచాలి. పూజలు చేయకూడదు.గ్రహణ కాలంలో గర్బిణీ స్త్రీలు బయటకు రాకూడదు. అంతేకాకుండా పదునైన వస్తువులు ఉపయోగించకూడదు. గ్రహణ సమయంలో తినడం, త్రాగడం వంటి పనులు చేయకూడదు. 

Also Read: Trigrahi Yogam 2024: న్యూ ఇయర్ లో మకరరాశిలో త్రిగ్రాహి యోగం.. ఈ రాశులకు గోల్డెన్ డేస్ స్టార్ట్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News