Solar Eclipse 2023: ఈ ఏడాది అంటే 2023 తొలి సూర్య గ్రహణం మరో రెండ్రోజుల్లో ఏప్రిల్ 20న ఉంది. సూర్య గ్రహణం సందర్భంగా రెండు అత్యంత శుభ యోగాలు ఏర్పడనున్నాయి. ఈ శుభ యోగాల ప్రభావం ముఖ్యంగా 3 రాశులపై పడనుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..
హిందూ పంచాంగాల ప్రకారం సూర్య, చంద్ర గ్రహణాలు ఎప్పుడు ఎర్పడినా అన్ని రాశులపై ఆ ప్రభావం పడుతుంటుంది. ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏప్రిల్ 20వ తేదీన ఏర్పడనుంది. గురువారం ఏప్రిల్ 20వ తేదీ ఉదయం 7.04 గంటల నుంచి మద్యాహ్నం 12.29 గంటల వరకూ ఉంటుంది. సూర్య గ్రహణం మేషరాశి, అశ్విని నక్షత్రంలో ఏర్పడనుంది. ఈసారి సూర్య గ్రహణం 2 శుభయోగాల చాటున ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఫలితంగా మూడు రాశులపై తీవ్ర కష్టాలు వెంటాడనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..
జ్యోతిష్యం ప్రకారం ఈసారి సూర్య గ్రహణం నాడు సూర్యుడు తన రాశి మేషరాశిలో పాపాలకు కారకుడిగా భావించే రాహువుతో కలిసి ఉంటాడు. రాహువుతో కలిసి బుధుడు కూడా ఇదే రాశిలో ఉంటాడు. అటు మేషరాశికి అధిపతి బుధుడు. ఈ క్రమంలో ఏప్రిల్ 20న మంగళ, బుధ గ్రహాలు రెండూ ఒకాదనికొకటి ప్రత్యర్ధి రాశుల్లో ఉంటాయి. దీంతో గ్రహణ యోగం ఏర్పడుతుంది. గ్రహణం రోజున ఇలా జరగడం అశుభంగా భావిస్తారు.
వృషభ రాశి
గురువారం ఏర్పడనున్న సూర్య గ్రహణం కారణంగా జరిగే అశుభ యోగాల వల్ల జీవితంలో ఒకేసారి పెను కష్టాలు రానున్నాయి. ఆదాయంతో పోలిస్తే ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయి. ఆదాయపు మార్గాలు తగ్గిపోతాయి. ధననష్టం కలగవచ్చు. తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త పడండి. లేకపోతే మూల్యం చెల్లించుకోవల్సి వస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.
మేష రాశి
అశుభ యోగాల కారణంగా ఏప్రిల్ 20న సూర్య గ్రహణం రోజు మేష రాశి జాతకులకు ఇబ్బందులు కలగనున్నాయి. మీ పనుల్లో ఊహించని ఆటంకాలు ఎదురౌతాయి. వ్యాపారంలో తీవ్ర నష్టాలు రావచ్చు. ఉద్యోగంలో కూడా సమస్య ఉత్పన్నమౌతాయి. ఈ సమస్యలతో మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది.
కన్యా రాశి
సూర్య గ్రహణం రోజున కన్యా రాశి జాతకులకు ఆర్ధిక పరిస్థితి పూర్తిగా వికటిస్తుంది. కుటుంబంలో విభేధాలు ఏర్పడవచ్చు. పాత వ్యాధులు తిరగబెట్టవచ్చు. అంటే ఆరోగ్యం కూడా ఈ రాశి జాతకులకు ఏ మాత్రం సహకరించదు. పనిచేసేచోట సహచరులతో మంచి సంబంధాలు ఉండవు. సమాజంలో మీ గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లుతుంది.
Also read: Guru Gochar 2023: ఏప్రిల్ 22న ఊహించని ఘటన.. ఈ 3 రాశులకు అంతులేనంత ఐశ్వర్యం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook