Karthika Pooja:కార్తీక మాసం.. దీపావళి అమావాస్య ముగియడంతో ప్రారంభం అయ్యే మాసాన్ని కార్తీక మాసం అంటారు. ఈ మాసం ను శైవులు, వైష్ణవులు అత్యంత పవిత్రమైన మాసంగా పరిగణిస్తారు. ఈ మాసానికి ఉండే విశిష్టత మాటల్లో చెప్పడానికి సాధ్యపడదు. తెల్లవారి స్నానాలు.. జపాలు ..తపాలు.. నిత్య పూజలు ..అభిషేకాలు ఉపవాసాలు..వనభోజనాలు.. ఇలా ఈ మాసం మొత్తం ఒక పవిత్రమైన భావనతో గడుస్తుంది.
దీపావళి తర్వాత అమావాస్య ముగిస్తే కార్తీక మాసంతో పాటు శీతాకాలం కూడా ప్రారంభమవుతుంది. చల్లటి వాతావరణం ను కూడా లెక్క చేయకుండా తెల్లవారుజాముని చన్నీటి స్నానాలు చేసి.. దైవారాధనతో నిరంతరం గడిపే అయ్యప్ప భక్తులు ఒకవైపు అయితే శివయ్యకు అభిషేకాలు ,పూజలు మరొకవైపు. ఇక గోవిందా మాల, భవానీ మాల దీక్షలతో కార్తీక మాసం సందడిగా ఉంటుంది.
కార్తీకమాసం కి ఉన్న గొప్పతనం ఏమిటంటే.. ఈ మాసంలో ఒక్కరోజు తెల్లవారుజామున తలారా స్నానం చేసి దీపారాధన చేసిన ఇప్పటివరకు చేసిన సకల పాపాలు హరిస్తాయని శాస్త్రాలు చెబుతాయి. ఈ మాసంలో హరిహరులలో ఎవరిని తలచినా.. కొలిచినా జన్మజన్మల పుణ్యం పొందుతారు. ఈ మాసంలో తనని భక్తిశ్రద్ధలతో పూజించిన భక్తులకు ఆ కైలాస నాథుడి కటాక్షం కలుగుతుందని పండితులు చెబుతారు.
ఈ కార్తీక మాస విశిష్టత గురించి శివపురాణం, మార్కండేయ పురాణాలలో ప్రస్తావించారు. ఈ మాసం సూర్యోదయాన్ని కంటే ముందే లేచి సముద్ర స్నానం చేసి ఆ తరువాత దీపారాధన పూజలు నిర్వహిస్తారు. అలాగే ఈ మాసంలో సోమవారం నాడు సదాశివుని దర్శించుకొని వనభోజనాలు చేస్తారు. అయితే ఈ మాసంలో జరిగే ఈ పూజలు ,వ్రతాలు, నియమ నిబంధనల వెనుక ఆధ్యాత్మికతే కాకుండా ఆరోగ్యపరమైన ఉద్దేశం కూడా ఉంది.
కార్తీక మాసంలో చేసే దానాల వల్ల తరతరాలు సుఖ సంతోషాలతో ,ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతాయి అని ప్రజలు నమ్ముతారు. అందుకే ఈ మాసంలో ఫలదానం దగ్గర నుంచి అన్నదానం వరకు అనేక దానాలు శక్తి కొద్దీ చేయాలని స్కంద పురాణంలో వివరించబడింది. కన్యాదానం అన్ని దానాల లోకి విశిష్టమైనదిగా భావిస్తారు కాబట్టే ఈ మాసంలో ఎక్కువగా పెళ్లిళ్లు కూడా జరుగుతాయి. కేవలం పూజలు పునస్కారాలే కాకుండా ఈ మాసంలో పదిమందికి భోజనం పెట్టడం వల్ల ఎనలేని పుణ్యం దక్కుతుంది.
Also Read: Delhi Air Pollution: ఢిల్లీపై కరుణించిన ప్రకృతి, వర్షం కారణంగా పెరిగిన గాలి నాణ్యత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook