Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Shukra Gochar 2022: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, నవంబర్ 11న శుక్రుడు వృశ్చిక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ శుక్ర సంచారం 3 రాశుల వారికి ప్రతి పనిలోనూ విజయాన్ని ఇస్తుంది.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Nov 6, 2022, 03:48 PM IST
Shukra Gochar 2022: వృశ్చికరాశిలోకి శుక్రుడు... నవంబర్ 11 నుండి ఈ 3 రాశులకు డబ్బే డబ్బు..

Shukra Gochar In Scorpio 2022: పంచాంగం ప్రకారం, గ్రహాలు తమ రాశులను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటాయి. ఈ మార్పు కొందరికి శుభం, కొందరికి అశుభం. నవంబర్ 11 న లవ్, రొమాన్స్, సంపద మరియు లగ్జరీ లైఫ్ కు కారకుడైన శుక్రుడు వృశ్చికరాశిలో (Venus transit in Scorpio 2022) సంచరించబోతున్నాడు. ఈ సంచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్రుని సంచారం ఈ రాశులకు శుభప్రదం
తుల (Libra): శుక్రుని సంచారం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ రాశి నుండి రెండో ఇంట్లో సంచరించబోతున్నాడు. దీంతో మీరు ఆకస్మిక ధనాన్ని పొందుతారు. మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ఇదే మంచి సమయం. మీడియా, సినిమా, విద్య రంగాలకు సంబంధించిన వ్యక్తులు కెరీర్ లో పురోగతి సాధిస్తారు.

సింహం (Leo): శుక్రుని సంచారం మీకు ఆర్థికంగా లాభిస్తుంది. ఎందుకంటే శుక్రుడు మీ రాశి నుండి నాల్గవ ఇంటిలో సంచరించబోతున్నాడు. మీరు ఈ సమయంలో ఏదైనా వాహనం లేదా ఆస్తిని కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీ కోరికలు నెరవేరుతాయి. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. 

వృషభం (Taurus): శుక్రుని రాశిలో మార్పు వృషభ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే శుక్ర గ్రహం మీ సంచార జాతకంలో ఏడవ ఇంట్లో సంచరించబోతోంది. దీంతో మీరు మీ పనిలో విజయం సాధిస్తారు. అలాగే మీ వైవాహిక జీవితం కూడా బాగుంటుంది. మీరు వ్యాపార, ఉద్యోగాల్లో రాణిస్తారు. 

Also Read: Guru Margi 2022: 119 రోజుల తర్వాత మార్గంలోకి గురుడు.. ఈ 3 రాశులకు గోల్డెన్ డేస్ మెుదలు.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News