Shukra Gochar 2022: దీపావళికి ముందు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా మరి..

Shukra Gochar 2022: అక్టోబరు 18న శుక్రుడు తులారాశిలోకి ప్రవేశించాడు. ఇది 5 రాశుల వారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 21, 2022, 03:52 PM IST
Shukra Gochar 2022: దీపావళికి ముందు ఈ 5 రాశులపై డబ్బు వర్షం.. ఇందులో మీరున్నారా మరి..

Shukra Gochar 2022: జ్యోతిషశాస్త్రంలో గ్రహాలు రాశిచక్రాన్ని మార్చడం వల్ల అది మానవ జీవితంపై మంచి మరియు చెడు ప్రభావాలను చూపిస్తాయి. ఈనెల 18న శుక్రుడు తులరాశిలోకి (Venus transit in libra 2022) ప్రవేశించాడు. ఇది కొన్ని రాశులపై సానుకూల ప్రభావం చూపుతుంది. ప్రేమ, శృంగారం, సంపద, ఆనందం, లగ్జరీ లైఫ్ కు కారకుడు శుక్రుడు. తులరాశిలో శుక్ర సంచారం వల్ల కొన్ని రాశులవారిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శుక్ర సంచారం ఈ 5 రాశులకు శుభప్రదం
మిధునరాశి (Gemini): శుక్ర సంచారం వల్ల ఈ రాశి వారికి మంచి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది. లావాదేవీల వల్ల లాభం ఉంటుంది. కుటుంబంతో మంచి సమయం గడుపుతారు.
కర్కాటకం (Cancer): తులరాశిలో శుక్ర సంచారం వల్ల ఈ రాశివారికి ధన సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి. విద్యా రంగానికి సంబంధించిన వ్యక్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారి ఆరోగ్యం మెరుగుపడుతుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
కన్య (Virgo): శుక్రుడి దయ వల్ల ఈ రాశి వారికి పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొత్త జాబ్ వస్తుంది. ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ సమయం మీకు కలిసి వస్తుంది. 

ధనుస్సు రాశి (Sagittarius): శుక్రుడి అనుగ్రహంతో ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభిస్తారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. వ్యాపారస్తులు లాభపడతారు. ఆర్థిక రంగం మునుపటి కంటే బలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఆధ్యాత్మిక విషయాలపై మొగ్గు చూపుతారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.
మకరరాశి (Capricorn): మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి.  కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వ్యక్తులు డబ్బు లావాదేవీలలో కూడా లాభపడతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 

Also Read: Guru Margi 2022: దీపావళి తర్వాత ప్రత్యక్ష సంచారంలోకి గురుడు.. ఈ రాశులకు బంపర్ బెనిఫిట్స్... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News