Rajyog Lucky Zodiac from Sunday In Telugu: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఎదో ఒక సమయంలో సంచారం చేస్తూ ఉంటుంది. కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు రాశి సంచారం చేయడం వల్ల రాజయోగాలు ఏర్పడుతూ ఉంటాయి. కుంభ రాశిలో శని దేవుడు కదలికలు జరపబోతున్నాడు. అలాగే మే 19న శుక్రుడు సొంత రాశి వృషభ రాశిలోకి సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా దాదాపు 30 ఏళ్ల తర్వాత శశ, మాల్వ్య రాజయోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో 4 రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అయితే ఈ సమయంలో ఈ శక్తివంతమైన రాజయోగాల కారణంగా ఏయో రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ రాశులవారికి లాభాలే లాభాలు:
వృషభ రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. వృషభ రాశివారికి షష, మాల్వ్య రాజయోగాలు ఏర్పడడం వల్ల అదృష్టం రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా విపరీతమై పురోగతి పొందుతారు. ఈ సమయంలో ఆర్థిక పరమైన విషయాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. దీంతో పరిస్థితులు బలంగా మారే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే వీరికి ఆదాయ వనరులు కూడా పెరుగుతాయి. వీరు కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు. ఉద్యోగాలు చేసేవారికి ఈ సమయం చాలా అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా వీరు ప్రమోషన్స్ కూడా పొందే ఛాన్స్ ఉంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లాలనుకునేవారికి ఈ సమయం చాలా బాగుటుంది.
సింహ రాశి:
మాల్వ్య రాజయోగం ఏర్పడటం వల్ల సింహ రాశివారికి బోలెడు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తే మంచి గొప్ప ఆఫర్స్‌ను పొందుతారు. అలాగే ఇప్పటికే ఉద్యోగాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ కూడా లభిస్తాయ. అంతేకాకుండా కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారికి ఇది సరైన సమయంగా చెప్పవచ్చు. వీరికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వీరు కూడా విదేశాలకు వెళ్లే ఛాన్స్ ఉంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
మకర రాశి:
మకర రాశివారికి కూడా ఈ ప్రత్యేకమైన యోగాలు ఏర్పడడం వల్ల ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా వీరికి అదృష్టం కూడా పెరుగుతుంది. అలాగే విద్యార్థులు మంచి చదువు కోసం విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అలాగే ఈ సమయంలో కష్టమైన పనులు చేయడం వల్ల కూడా సులభంగా విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఎప్పటి నుంచో పెడింగ్‌లో ఉన్న పనులు కూడా సులభంగా పూర్తవుతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి