Shani Vakri 2022: 11 రోజుల తర్వాత ఈ రాశుల వారికి అంతా శుభమే.. 6 నెలల పాటు డబ్బే డబ్బు!

On July 12 Saturn will retrograde in Capricorn. శని గ్రహం జులై 12న తిరోగమన స్థానంలో మకర రాశిలోకి ప్రవేశిస్తుంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Jul 1, 2022, 09:08 PM IST
  • 11 రోజుల తర్వాత ఈ రాశుల వారికి అంతా శుభమే
  • 6 నెలల పాటు డబ్బే డబ్బు
  • శని వారాల్లో శని చాలీసా పఠించాలి
Shani Vakri 2022: 11 రోజుల తర్వాత ఈ రాశుల వారికి అంతా శుభమే.. 6 నెలల పాటు డబ్బే డబ్బు!

On July 12 Saturn will retrograde in Capricorn: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట వ్యవధిలో తమ రాశి చక్రాన్ని మారుస్తుంది. ప్రతి నెలా ఏదో ఒక గ్రహం ప్రస్తుత రాశి చక్రం నుంచి బయటకు వెళ్లి.. మరొక రాశిలోకి ప్రవేశిస్తుంది. అదే సమయంలో కొన్ని గ్రహాలు తిరోగమనం చేస్తాయి. ప్రతి గ్రహం రాశి చక్రంలోని మార్పు.. మొత్తం 12 రాశుల మీద ప్రభావం చూపుతుంది. జూలై నెలలో 5 పెద్ద గ్రహాలు తమ రాశి చక్రాన్ని మార్చబోతున్నాయి. ఇందులో అత్యంత ప్రభావవంతమైన శని గ్రహం కూడా ఉంది.

శని గ్రహం జులై 12న తిరోగమన స్థానంలో మకర రాశిలోకి ప్రవేశిస్తుంది. 2023 జనవరి 17 వరకు శని గ్రహం మకర రాశిలోనే ఉండనుంది. శని గ్రహంను న్యాయ దేవుడు మరియు కర్మ దాత అని అంటారు. శని గ్రహం అంటేనే చాలా మంది భయపడతారు. ఎందుకంటే ఎన్నో చెడు ప్రభావాలకు ఇది మూలకారణం కాబట్టి. అయితే ఈసారి శని గ్రహం తిరోగమనం కారణంగా కొన్ని రాశుల వారికి మేలు జరగనుంది. ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 6 నెలల పాటు వారికి శుభకాలం నడవనుంది. 

శని గ్రహం మకర రాశిలోకి ప్రవేశించిన వెంటనే కర్కాటక, వృశ్చిక రాశి వారికి శని నుంచి విముక్తి కలుగుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీన రాశి వారికి కూడా శని నుంచి విముక్తి లభిస్తుంది. ఈ మూడు రాశుల వారు 6 నెలల (జనవరి 17, 2023) పాటు శని గ్రహ విముక్తి నుంచి పొందుతారు. అంతేకాదు మిథున, తుల, ధనుస్సు రాశి వారికి కూడా అనుకూల సమయం ఉండనుంది. వీరికి వచ్చే 6 నెలల పాటు ధనలక్ష్మి కృప ఉంటుంది. 

శని గ్రహ ఆగ్రహానికి గురవుతున్న వారు, శని గ్రహం నుంచి విముక్తి పొందిన వారందరూ ఈ పరిహారాలు చేస్తూనే ఉంటే వారిపై శని ప్రభావం తక్కువగా ఉంటుంది. శని వారాల్లో శని చాలీసా మరియు హనుమాన్ చాలీసా పఠించాలి. అవసరమైన వారికి శనికి సంబంధించిన వస్తువులను దానం చేయండి. శనివారం సాయంత్రం పీపల్ చెట్టు ముందు ఆవనూనె దీపం వెలిగించండి.

Also Read: తగలరాని చోట తాకిన బెయిల్.. మైదానంలో అక్కడ చేయి పెట్టుకుని విలవిలలాడిపోయిన వార్నర్ (వీడియో)

Also Read: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు.. 'బింబిసార' ఇంట్రెస్టింగ్‌ అప్‌డేట్‌!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News