Shani Uday Effect on Zodiac Signs 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..తొమ్మిది గ్రహాల్లో శని గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్య ఉంటుంది. శనిదేవుని కటాక్షం ఏ రాశులవారిపై పడుతుందో వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. జాతకంలో శని ప్రత్యేక స్థానంలో ఉంటే వ్యక్తిగత జీవితంలో చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా ఈ గ్రహాన్ని ఫలితాల ఇచ్చే దేవుడు, న్యాయ దేవుడిగా కూడా పరిగణిస్తారు. అయితే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల 12 రాశులవారిపై ప్రభావం పడుతుంది.
ప్రతి రాశికి శని స్థానం, స్థితి చాలా ముఖ్యమైనది. ఈ గ్రహం 2024 సంవత్సరంలో కుంభరాశిలో గమనాన్ని మర్చుకోబోతోంది. 2024 సంవత్సరం ఫిబ్రవరిలో శని గ్రహం గమనంలో మార్పులు రాబోతున్నాయి. అయితే ఈ గమనంలో మార్పులు రావడం వల్ల మూడు రాశులవారికి విపరీతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సమయంలో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
వృషభ రాశి:
శని గ్రహం 2024 సంవత్సరంలో తన గమనాన్ని మార్చుకోవడం వల్ల వృషభ రాశివారికి చాలా మేలు జరుగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. శనిదేవుని అనుగ్రహం వల్ల మీరు అనుకూల ఫలితాలు పొందుతారు. అంతేకాకుండా అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. దీంతో పాటు ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులు కూడా లభించే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి. వైవాహిక జీవితం కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. ఈ సమయంలో ఆకస్మిక ధనలాభాలు కూడా పొందుతారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
తుల రాశి:
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం..శని గ్రహంలో మార్పుల కారణంగా తుల రాశి వారి జీవితంలో కూడా చాలా రకాల మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఉద్యోగాలు, వ్యాపారాల్లో కూడా మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. దీంతో పాటు వీరికి భౌతిక లాభాలు కూడా పెరుగుతాయి. ఉన్నట్టుండి ధన ప్రవాహం కూడా పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి.
ధనుస్సు రాశి:
ధనుస్సు రాశి వారికి జాతకంలో శని స్థానం మారడం వల్ల ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాకుండా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎలాంటి పనులు చేసిన సులభంగా విజయాలు సాధిస్తారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నవారు శుభవార్తలు కూడా వింటారు.
Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook