Saturn Retrograde 2023: వచ్చే నెలలో శని రివర్స్ కదలిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Shani Vakri 2023 effect: జూన్ 17న శనిదేవుడు తిరోగమనం చేయబోతున్నాడు. శని యెుక్క రివర్స్ కదలిక మెుత్తం అందరి జీవితాలను ప్రభావితం చేస్తుంది. శని వక్రీ ఏయే రాశులవారిని ప్రభావితం చేస్తుందో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 08:03 AM IST
Saturn Retrograde 2023: వచ్చే నెలలో శని రివర్స్ కదలిక.. ఈ 3 రాశులకు తిరుగులేదు ఇక..

Saturn Retrograde 2023: నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని కూడా ఒకటి. ఈ గ్రహం రెండున్నరేళ్లకు ఒకసారి తన రాశిని మారుస్తుంది. 30 ఏళ్ల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తున్నాడు. వచ్చే నెల 17న అదే రాశిలో తిరోగమనం చేయబోతున్నాడు. శని యెుక్క వక్రీ మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. శని సంచారం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం. 

మిథునరాశి: శని వక్రీ మిథునరాశి వారికి ఊహించని  ధనాన్ని ఇస్తుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. వ్యాపారులు లాభపడతారు. పెట్టుబడి పెట్టడానికి ఇదే అనుకూల సమయం. మీకు త్వరలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ వస్తుంది. బిజినెస్ విస్తరిస్తుంది. 
ధనుస్సు: శని తిరోగమనం కారణంగా మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. మీరు అన్ని సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పెట్టుబడికి ఇదే మంచి సమయం. మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. 

Also Read: Shani Jayanti 2023: శని జయంతి నాడు 3 శుభ యోగాలు.. శనిదేవుడి అనుగ్రహం పొందడానికి ఇలా చేయండి..

మేషం: శని తిరోగమనం మేషరాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. ఈ రాశి వారు కెరీర్ లో చాలా పురోగతిని సాధిస్తారు. వ్యాపారులు భారీగా లాభపడతారు. మీ ఆదాయం పెరుగుతుంది. వివిధ వనరుల ద్వారా మీకు ఆదాయం సమకూరుతుంది. మీ దాంపత్య జీవితం బాగుంటుంది. మీరు విదేశీ పర్యటనకు వెళ్లే అవకాశం ఉంది.
వృషభం: తిరోగమన శని వృషభ రాశి వారికి కలిసి వస్తుంది. మీరు కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. మీ జీతం రెట్టింపు అవుతుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. 

Also Read: Rahu Transit 2023: త్వరలో రాహువు సంచారం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News