Shani Jayanti 2022: శని జయంతి సమీపిస్తోంది. శనిదేవుడి అనుగ్రహం పొందేందుకు, శని దోషం, శని ప్రభావం నుంచి విముక్తి పొందేందుకు అనువైన సమయం. అయితే మరి ఏం చేయాలి, ఏం పూజలు చేయాలనేది తెలుసుకుందాం..
చాలామంది మెడలో లేదా కాలికి లేదా చేతికి నల్లటి దారం కట్టుకుని ఉంటుంటారు. దీనివెనుక చాలా కారణాలున్నాయి. హిందూమతాచారం, జ్యోతిష్యంలో నల్లదారం కడితే కలిగే ప్రయజనాలు చాలానే ఉన్నాయి. నల్లరంగనేది శనిదేవుడికి ముడిపడి ఉన్న రంగు. ప్రతియేటా జ్యేష్టమాసం అమావాస్యనాడు శని జయంతి జరుపుకుంటారు. ఈ ఏడాది మే 30 వస్తోంది.
ఆ రోజు శనిదేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు చేసే పూజలు త్వరగా ప్రభావం చూపిస్తాయి. కుండలిలో శనిదోషం ఉన్నవాళ్లు, శనిగోచారంతో ప్రభావితులైనవారు తప్పకుండా శనిపూజలు చేయాలి. నల్లదారం కట్టడమనేది ఇందులో భాగం.
నల్లదారంతో పాజిటివ్ ఎనర్జీ
జ్యోతిష్యం, వాస్తు ప్రకారం శరీరంలో ఏదో ఒక భాగంపై నల్లనిదారం కడితే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగెటివిటీ దూరమౌతుంది. దాంతోపాటు కాలిలో నల్లనిదారం కట్టుకుంటే..శనితో పాటు రాహు కేతువుల దుష్ప్రభావం కూడా తగ్గుతుంది. దీనివల్ల శని దోషం తొలగిపోతుంది.
మెడకు లేదా చేతికి నల్లటి దారాన్ని కట్టేకంటే కాలికి ధరించడమే మంచిదంటున్నారు.కాలినొప్పులతో తరచూ బాధపడేవాళ్లు ఎడమకాలికి నల్లదారం కట్టుకోవడం మంచిది. కడుపులో నొప్పితో ఇబ్బందిపడేవాళ్లు కాలి వేళ్లకు నల్లదారం కట్టుకోవాలి. దిష్టి తగలకుండా లేదా చెడు శక్తుల్నించి రక్షించుకునేందుకు నల్లదారం చాలా మంచిది. నల్లనిదారం కట్టడం వల్ల శనిదోషంతో పాటు రాహుకేతువుల చెడు ప్రభావం నుంచి కూడా విముక్తులవుతారు.
శని జయంతి రోజు నల్లదారం ధరించడం అత్యుత్తమం. ఇది కాకుండా ప్రతి శనివారం నాడు కూడా నల్లనిదారం ధరించడం మంచిది. నల్లదారంలో 9 ముడులుండాలి. ఆ తరువాత శనీశ్వరాలయం లేదా భౌరవ మందిరానికి వెళ్లి..ఆ దారాన్ని ధరించాలి. ఇలా చేస్తే చాలా మంచిదని నమ్మకం. నల్లదారాన్ని శుభ ముహూర్తం చూసుకుని ధరించాలి. నల్లదారం ధరించిన తరువాత 21 రోజులు శని బీజమంత్రాన్ని పఠించాలి
Also read: Venus Transit 2022: శుక్ర సంచారం.. ఈ 5 రాశులవారి వ్యక్తిగత జీవితంలో టెన్షన్ టెన్షన్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook