Festival Dates: శని జయంతి, సావిత్రి వ్రతం, వినాయక చతుర్ధిలు ఎప్పుడు..ఏం చేస్తే మంచిది

Festival Dates: హిందూవులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన వారమిది. వరుసగా వ్రతాలు, పండుగలు రానున్నాయి. మే 29 నుంచి జూన్ 4 వరకూ ఉన్న ఆ విశేషాలేంటో చూద్దాం...  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2022, 08:43 AM IST
 Festival Dates: శని జయంతి, సావిత్రి వ్రతం, వినాయక చతుర్ధిలు ఎప్పుడు..ఏం చేస్తే మంచిది

Festival Dates: హిందూవులకు అత్యంత ప్రాధాన్యత కలిగిన వారమిది. వరుసగా వ్రతాలు, పండుగలు రానున్నాయి. మే 29 నుంచి జూన్ 4 వరకూ ఉన్న ఆ విశేషాలేంటో చూద్దాం...

ఈ వారమంతా ఆధ్యాత్మిక చింతనతో కూడి ఉంటుంది. ఇవాళ అంటే మే 29 నుంచి వరుసగా సావిత్రీ వ్రతం, శని జయంతి, వినాయక చతుర్ధి పండుగలు, వ్రతాలున్నాయి. అందుకే ఈ వారం ఆధాత్మికం కానుంది. జ్యేష్ట అమావాస్య, సోమవతి అమావాస్య, వట సావిత్రి వ్రతం, శని జయంతి, వినాయక చతుర్ధి వంటి పండుగలు, ప్రత్యేక రోజులున్నాయి. మే 29 నుంచి జూన్ 4 వరకూ ఉన్న ఆ విశేషాలు తెలుసుకుందాం.

జ్యేష్ఠ అమావాస్య మే 30వ తేదీన ఉంది. ఆ రోజు సోమవారం. అందుకే అదే రోజును సోమవతీ అమావాస్య అని కూడా అంటారు. ఈ రోజు స్నాన, దానాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. సోమవతీ అమావాస్య మహిళలు సౌభాగ్య వ్రతం ఆచరిస్తారు. శివ, పార్వతులను పూజిస్తారు. దాంతోపాటు రావిచెట్టు వద్ద పూజలు చేస్తారు. 

ఇక జ్యేష్ఠ అమావాస్య తిధినాడు ప్రతి యేటా వట సావిత్రి వ్రతం ఆచరిస్తుంటారు. ఈ ఏడాది వట సావిత్రి వ్రతం మే 30నే వచ్చింది వివాహిత మహిళలు వట వృక్షానికి పూజలు చేస్తారు. జ్యేష్ఠ అమావాస్య రోజే...సావిత్రి దేవి తన పాతివ్రత్యంతో తన భర్త సత్య హరిశ్చంద్రుని ప్రాణాల్ని వెనక్కి రప్పించుకుంటుంది. ఈ కారణంతోనే వివాహిత మహిళలు ప్రతియేటా జ్యేష్ఠ అమావాస్య నాడు సావిత్రి వ్రతం చేస్తారు. తద్వారా భర్త ఆయుష్యు పెరగాలని కోరుకుంటారు. దాంపత్య జీవితం సుఖంగా ఉండాలని ఆశిస్తారు. 

మే 30వ తేదీ మంగళవారం నాడు శని జయంతి ఉంది. ఆ రోజు జ్యేష్ఠ అమావాస్యతో పాటు సోమవారం. ఈ ప్రతియేటా జ్యేష్ఠ అమావాస్య నాడే శని జయంతి జరుపుకుంటారు. ఆరోజున శని దేవుడికి పూజలు చేయడం, శని మంత్ర పఠనం, శని గ్రహానికి సంబంధించిన వస్తువుల్ని దానం చేయడం అనాదిగా వస్తున్న ఆచారం. ఇలా చేయడం ద్వారా శని పీడ, శని దోషం నుంచి బయటపడతారని విశ్వాసం.

జూన్ 3వ తేదీన జ్యేష్ఠ అమావాస్య శుక్ల పక్షంలో తిధి చతుర్ధి. ఆ రోజున వినాయక చతుర్ధి కూడా. అందుకే ఈ రోజు వినాయక చతుర్ధి వ్రతం ఆచరిస్తారు. జూన్ నెలలో తొలి వినాయక చతుర్ధి ఇది. ఈ రోజున గణేశుడికి పూజలు చేస్తారు. వత్రాలు ఉంటారు. వినాయక చతుర్ధి నాడు చంద్రుడిని చూడరు. 

Also read: Shani Jayanti 2022: శని జయంతి రోజు తప్పక పాటించాల్సిన 9 నియమాలు... పాటించకపోతే జీవితం కష్టాలమయం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News